Share News

Peddapalli: కాంగ్రెస్‌ ప్రభుత్వ లక్ష్యం.. ఆరోగ్య తెలంగాణ

ABN , Publish Date - Dec 25 , 2025 | 12:12 AM

ముత్తారం, డిసెంబర్‌ 24 (ఆంధ్రజ్యోతి): ఆరోగ్య తెలంగాణ కాంగ్రెస్‌ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖమంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు.

Peddapalli:  కాంగ్రెస్‌ ప్రభుత్వ లక్ష్యం.. ఆరోగ్య తెలంగాణ

108ను ప్రారంభించిన మంత్రి

ముత్తారం, డిసెంబర్‌ 24 (ఆంధ్రజ్యోతి): ఆరోగ్య తెలంగాణ కాంగ్రెస్‌ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖమంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. ముత్తారం మండలానికి ప్రభుత్వపరంగా మంజూరైన 108ఎమర్జెన్సీ సర్వీస్‌ను మచ్చుపేట గ్రామంలో మంత్రి శ్రీధర్‌బాబు బుధవారం ప్రారంభించారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు దుండె రాజేశం విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఉప సర్పంచ్‌ దొంతుల రాకేష్‌ గ్రామంలోని ఎస్సీ కాలనీలో సొంతడబ్బులు రూ.30వేలతో ఏర్పాటు చేసిన బోర్‌ను ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి తనవంతు సహాయ, సహకారాల ఎల్లప్పుడూ ఉంటాయని అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ చిలువేరు జ్యోతిలక్ష్మణ్‌, కాంగ్రెస్‌ జిల్లా ఉపాధ్య క్షుడు చొప్పరి సదానందం, మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ మద్దెల రాజయ్య, మైనారిటీ సెల్‌ మండల అధ్యక్షుడు వాజీద్‌ పాషాతోపాటు తదిత రులున్నారు.

14 బీటీ రోడ్లకు 43.93 కోట్లు మంజూరు

మంథని: మంథని నియోజకవర్గంలోని పలుమండలాల్లో 14బీటీ రోడ్లు నిర్మాణాణాలకు డీఎంటీఎఫ్‌, సీఆర్‌ఆర్‌ నుంచి రూ.43.93 కోట్లు మంజూరు చేయించినట్లు రాష్ట్ర ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు బుధవారం తెలిపారు. మంథని మండ లంలోని నాగారం ఎక్స్‌ రోడ్‌ నుంచి కన్నాల వెంకటేశ్వరస్వామి టెంపుల్‌ వరకు రూ.2.50 కోట్లు, పీడబ్ల్యూరోడ్‌ గుమ్మూ నూరు నుంచి వయా దంతెలపల్లి నుంచి కాకర్లపల్లి వరకు రూ.3.75కోట్లు, చిన్నఓదాల గ్రామం నుంచి మానేరు నది వరకు రూ.1కోటి, విలోచవరం పీడబ్ల్యూరోడ్‌ నుంచి ఆయ్యాగారి చెరువు వరకు రూ. 3.62 కోట్లు, కన్నాల నుంచి మల్లెపల్లి వరకు రూ.1.82కోట్లు, ముత్తారం మండలంలోని హరిపురం నుంచి పోతారం వరకు రూ.2కోట్లు, కమాన్‌పూర్‌ మండలంలోని పెంచికల్‌పేట నుం చి ఎఫ్‌పీఐగేట్‌ వరకు రూ.9.90కోట్లు, మహా ముత్తారం మండలంలోని నర్సింగపూర్‌ నుంచి రేగులగూడెం వరకు రూ.2.30 కోట్లు, కాటారం పీడబ్ల్యూ రోడ్‌ నుంచి సబ్‌స్టేషన్‌పల్లి వయా దుబ్బగూడెం వరకు రూ.3కోట్లు, మల్హర్‌ మండ లంలోని వల్లెంకుంట నుంచి మానేరు వరకు రూ.1.80కోట్లు, కాటారం మండలంలోని ఆర్‌అం డ్‌బీరోడ్‌ సుబ్బయ్యపల్లి నుంచి ప్రతాపగిరి వరకు రూ.3.50కోట్లు. మహదేవపూర్‌ మండలంలోని మహదేవపూర్‌ నుంచి గోదావరి వయా ఫకీరువాడ వరకు రూ.3 ోట్లు, పిడబ్ల్యూ రోడ్‌ నుంచి గోదావరి వయా పలిమెల వరకు రూ. 3.24కోట్లు, బీటీరోడ్‌ బెగ్లూరు నుంచి గోదావరి వయా హనుమాన్‌ టెంపుల్‌ వరకు రూ. 2.50కోట్లు మంజూరైనట్లు మంత్రి శ్రీధర్‌ బాబు తెలిపారు.

బాదిత కుటుంబాలకు పరామర్శ

రామగిరి: మండలంలోని బుధవారంపేట్‌, నాగేపల్లి గ్రామాల్లో బుధవారం రాత్రి ఐటి శాఖ మంత్రి దుద్ధిళ్ళ శ్రీధర్‌బాబు పలు కుటుంబా లను పరామర్శించారు. బుధవారంపేట్‌ సర్పంచ్‌ మామా దేవునూరి లక్ష్మయ్య ఇటివల మరణించగా ఆయన కుటుంబాన్ని ఐటిశాఖ మంత్రి శ్రీధర్‌బాబు పరామర్శించారు. ఆయన వెంటగా కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

Updated Date - Dec 25 , 2025 | 12:12 AM