Share News

Peddapalli: యూరియా సరఫరాలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం: మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌ రెడ్డి

ABN , Publish Date - Sep 11 , 2025 | 12:43 AM

పెద్దపల్లిటౌన్‌, సెప్టెంబరు 10 (ఆంఽధ్రజ్యోతి): రైతులకు యూరియా అందించడంలో కాంగ్రెస్‌ ప్రభు త్వం పూర్తిగా విఫలమయ్యిందని మాజీఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు.

 Peddapalli:   యూరియా సరఫరాలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం: మాజీ ఎమ్మెల్యే  దాసరి మనోహర్‌ రెడ్డి

పెద్దపల్లిటౌన్‌, సెప్టెంబరు 10 (ఆంఽధ్రజ్యోతి): రైతులకు యూరియా అందించడంలో కాంగ్రెస్‌ ప్రభు త్వం పూర్తిగా విఫలమయ్యిందని మాజీఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలో ర్యాలీతీసి అయ్యప్ప టెంపుల్‌ వద్ద రాజీవ్‌ రహదారిపై ధర్నా చేపట్టారు. అనంతరం మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ సకాలంలో యేరియా వేయక పోవడం వల్ల సరై పంట దిగుబడి రాదన్నారు. రైతులకు యూరియా అందించే వరకు బీఆర్‌ఎస్‌ పక్షాన పోరాటం చేస్తామన్నారు. కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ చైర్మన్‌ రఘువీర్‌సింగ్‌, మాజీ జెడ్పీ టీసీలు గంట రాములు, వంగల తిరుపతిరెడ్డి, మాజీ ఎంపీపీ నూనెటి సంపత్‌, మోహన్‌రావు, పెద్దపల్లి పట్టణ అధ్యక్షుడు ఉప్పురాజ్‌కుమార్‌, పెద్దపల్లి మండల అధ్య క్షుడు మార్కు లక్ష్మణ్‌, ఐరెడ్డి వెంకటరెడ్డి, మోబిన్‌, సలేంద్ర రాములు, ముత్యాలరాజయ్య, నిదానపురం దేవ య్య, తాళ్లపల్లి మనోజ్‌, పెంచాల శ్రీధర్‌, మల్లేశం, ఖదీర్‌ ఖాన్‌, కొయ్యడ విక్రం, మేడగోనిశ్రీకాంత్‌ ముఖిమ్‌, మేకల కుమార్‌, సలేంద్రశ్రీనివాస్‌, సందీప్‌రావు,శ్యామ్‌, బాబురావు, గొట్ట మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 11 , 2025 | 12:43 AM