Peddapalli: స్ట్రాంగ్ రూంలను పరిశీలించిన కలెక్టర్
ABN , Publish Date - Oct 01 , 2025 | 11:22 PM
పెద్దపల్లి రూరల్/రామగిరి, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): పెద్దపల్లి మండలంలోని పెద్ద బొంకూర్ మదర్‌థెరిస్సా ఇంజనీరింగ్ కళాశాల, రామగిరిలోని జేఎన్టీయూ, మంథని ఇంజ నీరింగ్ కళాశాల, గోదావరిఖనిలోని ప్రభుత్వ డిగ్రీ పీజీ కళాశాలలో ఏర్పాటు చేస్తున్న స్ట్రాంగ్‌రూమ్‌లను అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ, డీసీపీ కరుణాకర్‌తో కలిసి బుఽధవారం కలెక్టర్ కోయ శ్రీహర్ష పరిశీలించారు.
పెద్దపల్లి రూరల్/రామగిరి, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): పెద్దపల్లి మండలంలోని పెద్ద బొంకూర్ మదర్‌థెరిస్సా ఇంజనీరింగ్ కళాశాల, రామగిరిలోని జేఎన్టీయూ, మంథని ఇంజ నీరింగ్ కళాశాల, గోదావరిఖనిలోని ప్రభుత్వ డిగ్రీ పీజీ కళాశాలలో ఏర్పాటు చేస్తున్న స్ట్రాంగ్‌రూమ్‌లను అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ, డీసీపీ కరుణాకర్‌తో కలిసి బుఽధవారం కలెక్టర్ కోయ శ్రీహర్ష పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ మంథని, గోదావరిఖని నియోజకవర్గం సంబంధించి 7మండలాలకు స్థానికసంస్థల ఎన్నికల పోలింగ్ అక్టోబర్ 23న, పెద్దపల్లి నియోజకవర్గానికి సంబంధించి 6మండలాలకు పోలింగ్ అక్టోబర్ 27న జరుగుతుందని అన్నారు. కలెక్టర్ వెంట జడ్పీ సీఈవో నరేందర్, ఆర్డీవోలు గంగయ్య, సురేష్, తహసీల్దార్లు రాజయ్య, అధికారులు న్నారు.