Peddapalli: బొగ్గుగనుల అమ్మకాలు సింగరేణికి ప్రమాదం
ABN , Publish Date - Oct 04 , 2025 | 11:54 PM
గోదావరిఖని, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): సింగరేణికి 40వేల మంది గని కార్మికులు, 35వేల మంది కాంట్రాక్టు కార్మికులు సమష్టిగా చేసిన కృషి ఫలి తంగా రూ.6390కోట్ల లాభాలు వచ్చాయని, అందులో 3వంతులు దారి మళ్లించి రూ.2వేల కోట్లు ప్రకటించి బోనసు ఇవ్వడం అన్యాయమని గోదావరి లోయ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షులు ఎస్ వెంకటేశ్వరరావు, ఐఎఫ్‌టీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి టీ శ్రీనివాస్ అన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న వెంకటేశ్వర్‌రావు
- నికర లాభాలను నుంచి బోనస్ ఇవ్వకుండా మోసం చేసిన యాజమాన్యం
- కాంట్రాక్ట్ కార్మికులకు మొండిచేయి
- జీఎల్‌బీకేఎస్ అధ్యక్షుడు వెంకటేశ్వర్‌రావు
గోదావరిఖని, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): సింగరేణికి 40వేల మంది గని కార్మికులు, 35వేల మంది కాంట్రాక్టు కార్మికులు సమష్టిగా చేసిన కృషి ఫలి తంగా రూ.6390కోట్ల లాభాలు వచ్చాయని, అందులో 3వంతులు దారి మళ్లించి రూ.2వేల కోట్లు ప్రకటించి బోనసు ఇవ్వడం అన్యాయమని గోదావరి లోయ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షులు ఎస్ వెంకటేశ్వరరావు, ఐఎఫ్‌టీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి టీ శ్రీనివాస్ అన్నారు. శనివారం గోదావరిఖని ఐఎఫ్‌టీయూ కార్యాల యంలో జరిగిన సింగరేణి ప్రాంత ముఖ్యకార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడుతూ బొగ్గుగనుల అమ్మకాలకు కాంగ్రెసు ప్రభుత్వం అనుమతించటం దానికి గుర్తింపు, ప్రాతినిథ్య సంఘాలు విజ్ఞప్తి చేయటం సింగరేణి సంస్థకు ప్రమాదకర మైందని, కార్మికుల మనుగడకు ఉరితాడు లాంటిద న్నారు. కంపెనీకి వచ్చిన మొత్తం లాభాల నుంచి బోనసును చెల్లించాలని, లాభాలలో సమభాగంగా ఉన్న కాంట్రాక్టు కార్మికులకు రూ.5,500ఇవ్వటం అవమానకరమైందన్నారు. సింగరేణి యాజమాన్యం ప్రభుత్వ యంత్రాంగానికి లొంగిపోతుందని, రాజ కీయ జోక్యాన్ని సింగరేణిలో పెంచడం వల్ల పరిశ్ర మకు నష్టం తలెత్తిందన్నారు. సింగరేణి యాజ మాన్యం తన ఆలోచన ధోర ణిని మార్చుకొని సింగరేణి పరిశ్రమను బతికించేందుకు బొగు ్గగనుల అమ్మకాలకు వ్యతి రేకంగా నిలబడాలని, కంపెనీలో కొత్త బొగ్గు బావులను తీయాలని, ఉద్యోగ ఉపాధిని కల్పించా లని, కార్మిక వ్యతిరేక చర్యలను విడనాడా లని అన్నారు. ఐ కృష్ణ అధ్య క్షతన జరిగిన ఈ సమా వేశంలో రాష్ట్రవర్కింగ్ ప్రెసి డెంట్ డీ బ్రహ్మానందం, జీఎల్ బీకేఎస్ ప్రధానకార్యదర్శి జే సీతారామయ్య, ఏ వెంకన్న, ఎండీ రాసుద్దీన్, ఈ నరేష్, ఈదునూరి రామకృష్ణ, రాజేశం, మల్లేశం పాల్గొన్నారు.