Peddapalli: అల్లీపూర్‌వాసులకు అందని శుద్ధనీరు
ABN , Publish Date - Nov 06 , 2025 | 12:50 AM
సుల్తానాబాద్, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): మండలంలోని అల్లీపూర్‌వాసులకు శుద్ధనీరు అందడం లేదు.
- చెత్తాచెదారంతో నిండిన మంచినీటి బావి
- పైపులైన్లకు లీకులు
- అల్లీపూర్ గ్రామంలో పారిశుధ్యం అధ్వానం
సుల్తానాబాద్, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): మండలంలోని అల్లీపూర్‌వాసులకు శుద్ధనీరు అందడం లేదు. గ్రామస్థులకు తాగునీటిని అందించే బావి పూర్తిగా దానిపైనున్న మొక్కల ఆకులతో, చెత్తాచెదారంతో నిండిపోయింది. అసలు ఆ నీటిని తాగడానికి కాదు కదా దేనికి ఉపయోగించే స్థితిలో లేదు. ఏళ్ల కొద్ది ఇదే పరి స్థితి ఉన్నా ఉన్నతాధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. బావిని బాగు చేయించి శుద్ధజలాల్ని అందించడం లేదు. ఫలితంగా ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నారు. ఎక్కువ శాతం గ్రామస్థులు ఈ నీటిని తాగరు. విధిలేని కొంతమంది మాత్రం తాగు తూ రోగాల పాలవుతున్నా రని గ్రామస్తులు పేర్కొంటు న్నారు. ప్రతి వర్షాకాలం రోడ్డు వెంట వెళ్లే మురుగు నీటి వరద కూడా ఈ బావి లోకి చేరుతుంది. బావి గాజులు కుంగిపోయి రోడ్డు వెంబడి వరదనీరు బావి లోకి వెళ్లే పరి స్థితు లు ఉన్నా యి. అయినా బావికి ఎలాంటి మరమ్మతులు, అభి వృద్ధి పనులు చేయించడం లేదు. వేరేచోట మంచినీటి బావిని తవ్వించాల్సిన అధి కారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
ప్రధాన రోడ్లన్నీ
అంధకారమే..
అల్లీపూర్ గ్రామంలోని ప్రధానరోడ్లన్నీ అందకారంతో నిండుకున్నాయి. చీకట్లో ప్రజలు నడిచి వెళ్లాలన్నా ఇబ్బందులు పడుతున్నారు. చీకటి మూలంగా ద్విచక్ర వాహనదారులు అనేక సందర్భాల్లో ప్రమాదాలకు గురై క్షతగ్రాతులుగా మారారు. వీధిలైట్లను సక్రమంగా నిర్వహిం చాలని, పెద్దవి ఏర్పాటు చేయాలని సూచిం చినా వారు సిబ్బంది పెడచెవిన పెడుతు న్నారని గ్రామస్థులు తెలిపారు. రోడ్ల వెంట అక్కడక్కడ చిన్న చిన్న లైట్లు ఉన్నా చెట్లనీడ వాటిని కమ్ముకొని వెలుగు రోడ్డు మీద పడటం లేదు.