Share News

peddapalli : పత్తి రైతులకు శాపంగా సీసీఐ నిబంధనలు

ABN , Publish Date - Sep 13 , 2025 | 12:43 AM

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి) పత్తి రైతులకు కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా నిబంధనలు శాపంగా మారాయి. మార్కెట్‌ యార్డుల్లో కాకుండా జిన్నింగ్‌ మిల్లులు ఉన్న చోటే సీసీఐ కొను గోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుండడంతో రైతులకు మద్దతు ధరలు దక్కకుండా పోతున్నాయి.

peddapalli :  పత్తి రైతులకు శాపంగా  సీసీఐ నిబంధనలు

- జిన్నింగ్‌ మిల్లుల వద్దనే కొనుగోలు కేంద్రాలు

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

పత్తి రైతులకు కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా నిబంధనలు శాపంగా మారాయి. మార్కెట్‌ యార్డుల్లో కాకుండా జిన్నింగ్‌ మిల్లులు ఉన్న చోటే సీసీఐ కొను గోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుండడంతో రైతులకు మద్దతు ధరలు దక్కకుండా పోతున్నాయి. నాలుగైదే ళ్లుగా సీసీఐ ఇదే విధానాన్ని అనుసరిస్తున్నది. ఈ వానా కాలం సీజన్‌లో జిల్లాలో 52 వేల ఎకరాల్లో రైతులు పత్తి పంటను సాగు చేశారు. అక్టోబర్‌ నెలాఖరు వరకు పత్తి పంట చేతికి రానున్నది. జిల్లాలో ఎనిమిది మార్కెట్‌ యార్డులు ఉన్నప్పటికీ ఒక పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్‌ యార్డులోనే పత్తి కొనుగోలు చేస్తుంటారు. మార్కెట్‌తోపాటు రైతులు జిన్నింగ్‌ మిల్లుల వద్ద సీసీఐ ఏర్పాటు చేస్తున్న కొనుగోలు కేంద్రాల వద్ద, మధ్య దళారులకు, జమ్మికుంట, చొప్పదండి వ్యవసాయ మార్కెట్‌ యార్డుల్లో పత్తిని విక్రయిస్తారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలు దక్కక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మార్కెట్‌ యార్డుల్లో మద్దతు ధర దక్కనప్పుడు, వారికి సీసీఐ అండగా నిలిచి మద్దతు ధర ఇవ్వాల్సి ఉంటుంది. గతంలో మార్కెట్‌ యార్డుల్లోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. రవాణా చార్జీల భారంతో జిన్నింగ్‌ మిల్లుల వద్దనే నాలుగేళ్ల నుంచి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నది. నామ్‌కే వాస్తేగా సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నప్పటికీ, తద్వారా పెద్దగా కొనుగోలు చేసేదేమి లేదు. అక్కడ పత్తి విక్రయించే రైతులే రవాణా చార్జీలు భరించి జిన్నింగ్‌ మిల్లు వద్దకు తీసుక పోవాలనే నిబంధన విధించడంతో చాలా మంది రైతు లు వ్యాపారులకే తక్కువ ధరకు కొనుగోలు చేయాల్సి వస్తున్నది. మార్కెట్‌లో మద్దతు ధరలు దక్కడం లేదని భావిస్తున్న తమ వద్దకు వచ్చే దళారులకే పత్తిని విక్ర యించి నష్టపోతున్నారు. జిల్లాలో నాలుగు చోట్ల జిన్నింగ్‌ మిల్లులు ఉన్నాయి. పెద్దపల్లి మండలం రాఘవాపూర్‌, నిమ్మనపల్లి, సుల్తానాబాద్‌ మండలం చిన్నకల్వల, కమాన్‌పూర్‌ మండలం గొల్లపల్లి గ్రామంలో జిన్నింగ్‌ మిల్లులు ఉన్నాయి. అక్కడే సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. ఈ ఏడాది పొడవు పింజ గల పత్తి క్వింటాలుకు రూ.8110, మధ్య రకం పింజ గల పత్తికి 7,710 రూపాయల మద్దతు ధర ప్రకటించింది. ఈ ధరలు అక్టోబర్‌ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. మూడేళ్లుగా రైతులకు మద్దతు ధరలు దక్కడం లేదు. క్వింటాలుకు 7,400 రూపాయలు మించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఫ మార్కెట్‌లోనే కేంద్రాలు ఏర్పాటు చేయాలి

రైతులకు మద్దతు ధర దక్కాలంటే జిన్నింగ్‌ మిల్లుల వద్ద గాకుండా మార్కెట్‌ యార్డుల్లోనే పత్తిని కొనుగోలు చేయాలని రైతు సంఘాల ప్రతినిధులు అంటున్నారు. మార్కెట్‌లో కేంద్రం ప్రకటించిన మద్దతు ధర దక్క నప్పుడు, మార్కెట్‌లోనే సీసీఐ అధికారులు రైతుల నుం చి పత్తిని కొనుగోలు చేసి వారికి మద్దతు ధర కల్పిం చాల్సి ఉంటుంది. కానీ నామమాత్రంగా కేంద్రాన్ని ఏర్పా టు చేసి జిన్నింగ్‌ మిల్లు వద్దకు వెళ్లాలని సూచిస్తున్నారు. పత్తిని జిన్నింగ్‌ మిల్లుల వద్దకు తీసుక వచ్చే రైతులకు అనేక ఆంక్షలు విధించి జిన్నింగ్‌ మిల్లు యజమానికే తక్కువ ధరకే అమ్ముకునేలా చేస్తున్నారనే విమర్శలున్నాయి. గ్రామాల్లో క్రాప్‌ బుకింగ్‌ జరుగుతు న్నది. సీసీఐకి పత్తి విక్రయించాలంటే, పంట పండించి నట్లు మండల వ్యవసాయాధికారి నుంచి ధ్రువీకరణతో పాటు క్రాఫ్‌ బుకింగ్‌ యాప్‌లో సర్వే వివరాలు నమో దు చేయాలి. ఇంకా ఇది జరగకపోవడంతో కొందరు వ్యాపారులు వ్యవసాయాధికారుల నుంచి తప్పుడు ధ్రువీకరణ పత్రాలు తీసుకుని సీసీఐకి పత్తి అమ్మి లబ్ధి పొందుతున్నారు. గత ఏడాది ఆయా మార్కెట్‌ యార్డుల కార్యదర్శులను సస్పెండ్‌ చేసింది. కొన్నింటిపై విచారణ జరిపింది. ఈసారి సర్వే పకడ్బందీగా నిర్వహిస్తేనే రైతులకు ఇబ్బందులు తొలుగుతాయి. అలాగే జిన్నింగ్‌ మిల్లుతో సంబంధం లేకుండా వ్యవసాయ మర్కెట్‌లోని పత్తి మార్కెట్‌లోనే సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని రైతు సంఘాల నాయకులు కోరుతున్నారు.

Updated Date - Sep 13 , 2025 | 12:43 AM