Peddapalli: నిర్మించారు.. నిరుపయోగంగా వదిలేశారు
ABN , Publish Date - Oct 04 , 2025 | 11:55 PM
ఓదెల, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): అధికారుల నిర్లక్ష్యంతో లక్షలాది రూపాయల ప్రజాసొమ్ము వృథా అవుతోంది. రూ.25లక్షలతో స్త్రీశక్తి భవనం, రూ.6లక్షలతో వ్యవసాయశాఖ భవనాన్ని నిర్మించారు.
- నిరుపయోగంగా ఉంటున్న కార్యాలయాలు
- శిథిలావస్థకు చేరుకుంటున్న వైనం
ఓదెల, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): అధికారుల నిర్లక్ష్యంతో లక్షలాది రూపాయల ప్రజాసొమ్ము వృథా అవుతోంది. రూ.25లక్షలతో స్త్రీశక్తి భవనం, రూ.6లక్షలతో వ్యవసాయశాఖ భవనాన్ని నిర్మించారు. ఈ రెండు కార్యాలయాలు తాళాలు వేసి నిరుపయోగంగా ఉండడంతో శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. వీటిని నిర్మించినప్పటి నుంచి ప్రారంభించలేదు. మండలపరిషత్ కార్యాలయంలో ఈజీఎస్ కార్యాలయాన్ని కొనసాగిం చారు. అనంతరం కార్యాలయంలో గదుల కొరత ఏర్పడడంతో స్త్రీశక్తి భవ నంలోకి ఈజీఎస్ కార్యాలయాన్ని మార్చారు. కొన్నాళ్లపాటు సజావుగానే విధులు కొనసాగినప్పటికీ, దీనికి ప్రత్యేక కార్యాలయాన్ని కేటాయించలేదు, నిర్మించలేదు. దీంతో రెండేళ్ల క్రితం ఐకేపీ ఏపీఎం ఉన్నతాధికారులకు ఫిర్యాదు సమర్పిస్తూ, స్త్రీశక్తిభవనాన్ని ఐకేపీకి కేటాయించాలని కోరడంతో అందులో నుంచి ఈజీఎస్ సిబ్బందిని ఖాళీ చేయించారు. దీంతో ఈజీఎస్ కార్యాలయానికి మళ్లీ మండలపరిషత్ కార్యాలయంలోని గదిని కేటాయించారు. అయిన ప్పటికీ మహిళాభవన్‌లో ఎవరూ కూడా ఎలాంటి విధులు నిర్వహించకపోవడంతో రెండేళ్ల క్రితం కార్యాలయానికి తాళాలు వేసి ఉంచారు. అలాగే గత ప్రభుత్వంలో ఇక్కడ రైతువేదికను నిర్మించి రైతుసమావేశాలు సైతం నిర్వహించారు. డీఆర్డీయే గ్రాంట్ రూ.6లక్షలతో నిర్మించిన వ్యవసాయశాఖ కార్యాలయం ఖాళీ కావడంతో ప్రస్తుతం ఇదికూడా శిథిలావస్థకు చేరుకుంది. 2008సెప్టెంబరు 26న, ఈ కార్యాలయాన్ని అప్పటి కలెక్టర్ సందీప్‌కుమార్ సుల్తానియా, ఎమ్మెల్యే గీట్ల ముకుందరెడ్డి ప్రారంభించి వ్యవసాయశాఖ అధికారులకు కేటాయిం చారు. దీనిని గిడ్డంగికి అధికారుల విధుల నిర్వహణకు ఉపయోగించారు. రైతువేదిక నిర్మితం కావడంతో ఇది కూడా ప్రస్తుతం నిరుపయోగంగా మిగిలిపోయింది. లక్షలాది రూపాయల ప్రజాధనంతో నిర్మించిన ఈ రెండు కార్యాలయాలు పూర్తిగా శిథిలావస్థకు చేరుకోకముందే గదులకొరత ఉన్న శాఖలకు కేటాయించి, ఉపయోగంలోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.
ఫ మండల పరిషత్ భవనంలో అన్నీ ఇరుకు గదులే..
ప్రస్తుతం మండలపరిషత్ కార్యాలయంలో ఏగది చూసినా ఉద్యోగు లకు ఇరుకు సమస్యలే కనిపిస్తున్నాయి అంతకుముందు అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు కార్యాలయానికి వచ్చిన సందర్భంలో ఎవరి శాఖ గదికి వాళ్లు వెళ్లి కూర్చుండేవారు. ప్రస్తుతం గదుల కొరత అధికా రులను వెంటాడుతున్నాయి.
ఫ శిథిలావస్థకు చేరకముందే ఉపయోగంలోకి తేవాలి..
- దాసరి రాజన్న,
మాజీ సర్పంచ్, పొత్కపల్లి
మండల కేంద్రంలో నిర్మించిన మహిళా భవనం, అలాగే వ్యవసాయశాఖ భవనం పూర్తిగా ఉపయోగంలోకి తేవాలి. ఏ శాఖకు కొరత ఉందో ఆ శాఖ సంబంధించిన కార్యాల యానికి, లేదా విద్యుత్‌శాఖకు కేటాయించిన ట్లయితే రైతులకు అందుబాటులో ఉండే అవ కాశాలు ఉన్నాయి.