Peddapalli:బొడ్డెమ్మ పూజలు ప్రారంభం
ABN , Publish Date - Sep 13 , 2025 | 11:56 PM
సుల్తానాబాద్, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): మహిళలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బతుకమ్మ పండుగలో భాగంగా శనివారం బొడ్డెమ్మ పూజలు నిర్వహించారు.
- వాడవాడలా బతుకమ్మ సంబరాలు
సుల్తానాబాద్, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): మహిళలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బతుకమ్మ పండుగలో భాగంగా శనివారం బొడ్డెమ్మ పూజలు నిర్వహించారు. స్థానిక శివాలయం, వేణుగోపాలస్వామి ఆలయాలతోపాటు వాడ వాడలా బొడ్డెమ్మను ప్రతిష్ఠించిన మహిళలు చక్కని పాటలతో ఆడుకున్నారు. ఈ సందర్భంగా అందుబాటులో ఉన్న పూలతో బతుకమ్మలను తయారు చేసి సామూ హికంగా బతుకమ్మ పాటలను పాడుతూ ఆడారు. తొమ్మిదిరోజులపాటు బొడ్డెమ్మ వేడుకలు కొనసాగుతాయని, అమావాస్య నుంచి చిన్నబతుకమ్మ వేడుకలు ప్రారంభమవుతాయని పండితులు వల్లంకొండ మహేష్ తెలిపారు. శివాలయంలో జరిగిన బొడ్డెమ్మ ప్రారంభ పూజల్లో ఆలయచైర్మన్ అల్లంకి సత్యనారాయణ భాగ్యలక్ష్మి, అరుణ్, శివలీల, అన్నపూర్ణ, వనతి, పల్లవి తదితరులు పాల్గొన్నారు.