Peddapalli: ఎన్టీపీసీ గుర్తింపు ఎన్నికల్లో.. బీఎంఎస్ ఘన విజయం
ABN , Publish Date - Sep 26 , 2025 | 12:17 AM
జ్యోతినగర్, సెప్టెం బరు 25 (ఆంధ్రజ్యోతి): గురువారం జరిగిన రామ గుండం ఎన్టీపీసీ గుర్తిం పు కార్మికసంఘం ఎన్ని కల్లో బీఎంఎస్ అనుబంధ ఎన్టీపీసీ కార్మిక సంఘ్ ఘన విజయం సాధించిం ది.
- ఐఎన్‌టీయూసీకి రెండో స్థానం
జ్యోతినగర్, సెప్టెం బరు 25 (ఆంధ్రజ్యోతి): గురువారం జరిగిన రామ గుండం ఎన్టీపీసీ గుర్తిం పు కార్మికసంఘం ఎన్ని కల్లో బీఎంఎస్ అనుబంధ ఎన్టీపీసీ కార్మిక సంఘ్ ఘన విజయం సాధించిం ది. ప్రత్యర్థి ఐఎన్‌టీ యూసీ అనుబంధ మజ్దూర్ యూనియన్‌పై 8ఓట్ల తేడాతో బీఎంఎస్ గెలుపొందింది. పోటీలో ఉన్న సీఐటీయూ కేవలం 12ఓట్లను నమోదుచేసింది. మొత్తం 212 ఓట్లకు గాను(ఉద్యోగులు) 98శాతంతో 208ఓట్లుపోలయ్యాయి. బీఎంఎస్‌కు 102ఓట్లు (49శాతం), ఐఎన్‌టీయూసీకి 94ఓట్లు(45శాతం), సీఐటీయూకు 12 ఓట్లు (5శాతం) వచ్చాయి. గెలిచిన బీఎంఎస్‌కు 60శాతం ఓట్లు రాకపోవడంతో 2ఎన్‌బీసీ (జాతీయ ద్వైపాక్షిక సంఘం) సభ్యులను దక్కించుకోలేకపోయింది. బీఎంఎస్‌కు ఒక ఎన్‌బీసీ సభ్యత్వం, రెండోస్థానంలో నిలిచిన ఐఎన్‌టీయూసీ ఒక ఎన్‌బీసీసభ్యత్వం లభించినట్లు ఎన్నికలఅధికారి,ఎన్టీపీసీ ఏజీఎం(హెచ్‌ఆర్) విజయ్‌కుమార్ సిక్దర్ ప్రకటించారు. గుర్తింపుయూనియన్‌గా బీఎంఎస్ మూడేళ్లపాటు (2028వరకు) కొనసాగుతుంది. కాగా, గుర్తింపు యూనియన్‌గా విజయం సాధించిన బీఎంఎస్ జనరల్‌బాడీసమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంటుంది.
ఐఎన్‌టీయూసీకి షాకిచ్చిన బీఎంఎస్..
ఎన్టీపీసీ గుర్తింపు ఎనన్నికలలో ఐఎన్‌టీయూసీకి బీఎంఎస్ యూనియన్ షాకిచ్చింది. గత రెండుపర్యాయాలు(6సంవత్సరాలు) గుర్తింపు యూనియన్‌గా కొనసాగిన ఐఎన్‌టీయూసీని ఈసారి అనూహ్యంగా భారతీయ మజ్దూర్ సంఘ్ పరాజయం పాలు చేసింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి బీఎంఎస్ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. ఆ యూనియన్ నాయకులు వ్యూహాత్మకంగా పనిచేశారు. 2027లో జరగబోయే వేతన సవరణ విషయంలో మెరుగైన వేతన ఒప్పందం చేయిస్తామని, సీడీపీ, పీఆర్‌ఎంఎస్ సాధించేందుకు కృషి చేస్తా మంటూ బీఎంఎస్ చేసిన హామీలను ఉద్యోగులు నమ్మినట్లు తెలుస్తున్నది. అలాగే గుర్తింపు యూనియన్‌గా ఐఎన్‌టీయూసీ వైఫల్యాలను ఎండగట్టడంలో బీఎంఎస్ సక్సెస్ అయ్యింది. నాలుగుదశాబ్ధాల రామగుండం ఎన్టీపీసీ చరిత్రలో బీఎంఎస్ మొదటిసారి గుర్తింపు కార్మిక సంఘంగా గెలిచి చరిత్ర సృష్టించింది. గతంలో మెజారిటీసార్లు ఐఎన్‌టీయూసీ,సీఐటీయూ, హెచ్‌ఎంస్ యూనియన్లు గుర్తింపు సంఘాలుగా గెలిచాయి. ఈ క్రమంలో మొదటిసారిగా బీఎంఎస్ గుర్తింపు యూనియన్‌గా నిలిచింది.
ఈ విజయం కార్మికులకు అంకితం..
- బీఎంఎస్ అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి
ఎన్టీపీసీ గుర్తింపు ఎన్నికల్లో తమ గెలుపును కార్మికు లకు అంకితం చేస్తున్నామని కార్మికసంఘ్(బీఎంఎస్) అధ్యక్ష,కార్యదర్శులు కేటిరెడ్డి భాస్కర్‌రెడ్డి, సాగర్ రాజు, కోశాధికారి చల్లా సత్యనారాయణరెడ్డి తెలిపారు. విజయం సాధించిన అనంతరం విలేకరులతోమాట్లాడతూ సుదీర్ఘకాలం గుర్తింపు యూని యన్‌గా కార్మికుల ప్రయోజనాలను పట్టించుకోని ఐఎన్‌టీయూసీకి కార్మికులే బుద్ది చెప్పారన్నారు. వ్యక్తిగత లాభాపేక్షతో పైరవీలకే పరిమితమైన మజ్దూర్ యూనియన్‌ను ఉద్యోగులు తిరస్కరించారని స్పష్టం చేశారు. తాము ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చేడం కోసం కృషిచేస్తామని తెలిపారు. కాగా, ఎన్టీపీ సీలో బీఎంఎస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. డప్పుచప్పుళతో టౌన్‌షిప్ లో ర్యాలీ నిర్వహించారు.