Peddapalli: తల్లిని అవమానించాడనే ఆర్‌ఎంపీపై హత్యాయత్నం
ABN , Publish Date - Oct 01 , 2025 | 11:19 PM
కోల్‌సిటీ, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): గోదావరిఖనిలో సంచలనం సృష్టించిన ఆర్‌ఎంపీ యశ్వంత్‌పై హత్యాయత్నం కేసును ఎట్టకేలకు వన్‌టౌన్ పోలీసులు ఛేదించారు.
అనుమానం రాకుండా బెంగుళూరుకు వెళ్లి హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సు
9నెలల పాటు విచారణ జరిపి ఛేదించిన పోలీసులు
ముగ్గురు నిందితుల అరెస్టు.. పరారీలో నిందితుడి తల్లి..
కోల్‌సిటీ, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): గోదావరిఖనిలో సంచలనం సృష్టించిన ఆర్‌ఎంపీ యశ్వంత్‌పై హత్యాయత్నం కేసును ఎట్టకేలకు వన్‌టౌన్ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో గోదావరిఖని విఠల్‌నగర్‌కు చెందిన ప్రధాన నింది తుడు కన్నం ఛత్రపతి(20), అతన్ని స్నేహితుడు నల్లగుల ప్రసాద్ అలియాస్ సన్నీ(20), రాంనగర్‌కు చెందిన కారు డ్రైవర్ అనవేని సాయితేజ అలియాస్ బచ్చలి చింటు(26)ను బుధ వారం అరెస్టు చేసినట్టు వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్ర సనారెడ్డి పేర్కొ న్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఛత్రపతి తల్లి గోదావరిఖని సింగరేణి ఏరియా హాస్పిటల్‌లో నర్సుగా పనిచేసే కన్నం సంధ్య పరారీలో ఉంది. కేసుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు..
గోదావరిఖనికి సింగరేణి ఏరియా ఆసుపత్రిలో కన్నం సంధ్య కాంట్రాక్టు పద్దతిలో స్టాఫ్ నర్సుగా పనిచేస్తోంది. అదే ఆసుపత్రిలో మాడుగుల నాగరాజు, అతని భార్య దేవి పారిశుధ్య కార్మికులుగా పని చేస్తు న్నారు. వీరు స్థానిక రామాలయం సమీ పంలోని క్వార్టర్లలో నివాసముండే ఆర్‌ఎంపీ యశ్వంత్ నిర్వహించే డీఎన్ హోంకేర్ సర్వీస్‌లో కూడా పనిచే సేవారు. డీఎన్ హోంకేర్ సర్వీస్‌లో సేవ లందిస్తే అదనంగా డబ్బులు వస్తాయని వారు కన్నం సంధ్యకు సూచించారు. దీనికి ఆమె అంగీకరించకపోగా సగం డబ్బులు హోంకేర్ సర్వీస్‌వారు తీసుకుంటారని, మిగతా సగం మాత్రమే పని చేసే వారికి ఇస్తారని పేర్కొన్నది. ఈవిషయాన్ని నాగరాజు యశ్వంత్‌కు చెప్పడంతో ఆయన రెండు మూడుసార్లు సంధ్యను అసభ్యపదజాలంతో దూషించడమే కాకుండా, వ్యక్తి త్వాన్ని కించపరిచాడు. ఈ విషయాన్ని ఆమె కుమారుడు ఛత్రపతికి చెప్పుకుని బాధపడింది. దీంతో అతడు యశ్వంత్‌పై పగ పెంచుకుని అతన్ని ఏదైనా చేయాలను కున్నాడు. ఈ విషయాన్ని తన స్నేహితుడైన సాయితేజ, ప్రసాద్‌కు చెప్పాడు. యశ్వంత్ కదలికలను అదేకాలనీలో నివాసముండే అనవేని సాయితేజ గమనించి చత్రపతికి చేరవేశాడు. ఈఏడాది జనవరి 7వ తేదిన ఛత్రపతి, అతని తల్లి సంధ్య, స్నేహితులు సాయితేజ, ప్రసాద్ యశ్వంత్ ఇంటివెనుక నుంచి లోపలికి చొరబడ్డారు. ఛత్రపతి యశ్వంత్‌పై కత్తితో దాడిచేసి నరికాడు. అనంతరం ఇంటి వెనుక వైపు నుంచి పారిపోయారు. అనుమానం రాకుండా చత్రపతి బెంగుళూరుకు వెళ్లి హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సులో చేరాడు. సీసీ ఫుటేజీలో ఒక ముఖం మాత్రమే రికార్డు కావడంతో దాని ఆధారంగా పోలీసులు పరిశోధన ప్రారంభిం చారు. సీఐ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో క్రైమ్‌పార్టీ పోలీసులు నిందితుల ఆచూకీ కోసం ప్రయత్నించారు. ఎట్టకేలకు ఛత్రపతిని అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు విషయం బయట పడింది. ఈ కేసు ఛేదించడంలో కృషిచేసిన క్రైమ్‌పార్టీ హెడ్ కానిస్టేబుల్ రమేష్, సదానందం, శ్రీనివాస్, కానిస్టేబుళ్లు రమేష్, మధుకర్, శ్రీనివాస్‌ను సీఐ ఇంద్రసేనారెడ్డి అభినందించారు.