Peddapalli: చదువుతోపాటు క్రీడలపై మక్కువ పెంచుకోవాలి
ABN , Publish Date - Oct 09 , 2025 | 12:23 AM
పెద్దపల్లి కల్చరల్, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): చదువుతోపాటు క్రీడలపై విద్యా ర్థులు మక్కువ పెంచుకోవాలని జిల్లావిద్యాధికారి మాధవి అన్నారు.
- డీఈవో మాధవి
పెద్దపల్లి కల్చరల్, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): చదువుతోపాటు క్రీడలపై విద్యా ర్థులు మక్కువ పెంచుకోవాలని జిల్లావిద్యాధికారి మాధవి అన్నారు. జిల్లా కేంద్రం లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 69వజిల్లాస్థాయి ఎస్‌జీఎఫ్ అథ్లెటిక్స్ పోటీలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై క్రీడలను జెండాఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లా డుతూ క్రీడలతోనే విద్యార్థులకు పూర్తి పరిపక్వత లభిస్తుందని, ప్రతి క్రీడాకారుడు గెలుపోటములను సమంగా స్వీకరించాలని తెలిపారు. కార్యక్రమంలో డీవైఎస్‌వో అక్కపాక సురేష్, జిల్లాఎస్‌జీఎఫ్ కార్యదర్శి లక్ష్మణ్, పెటాఅధ్యక్ష, కార్యదర్శులు వేల్పుల సురేందర్, దాసరి రమేష్, జిల్లా ఎస్‌జీఎఫ్ మాజీ కార్యదర్శి కొమురోజు శ్రీనివాస్, ప్రిన్సిపాళ్లు రవీందర్‌రెడ్డి, పరశురాం, వ్యాయామ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.