Peddapalli: వైభవంగా లక్ష్మీనృసింహస్వామి కల్యాణం
ABN , Publish Date - Nov 06 , 2025 | 12:45 AM
పెద్దపల్లి రూరల్, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): మండలంలోని దేవునిపల్లి శ్రీ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో బుధవారం కార్తీకపౌర్ణమివేళ స్వామి వారి కల్యాణం అంగరంగవైభవంగా జరిగింది.
- ఆలయంలో మారుమోగిన గోవింద నామస్మరణ
పెద్దపల్లి రూరల్, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): మండలంలోని దేవునిపల్లి శ్రీ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో బుధవారం కార్తీకపౌర్ణమివేళ స్వామి వారి కల్యాణం అంగరంగవైభవంగా జరిగింది. ఆలయ ఈవో శంకర్, చైర్మన్ బొడ్డుపల్లి సదయ్య ఆధ్వర్యంలో వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య స్వామివారి కళ్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహిం చారు. ఆలయ ప్రాంగణమంతా గోవింద నామస్మర ణతో మారుమోగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పెద్దపల్లిరూరల్ ఎస్‌ఐ మల్లేష్ ఆధ్వర్యంలో పోలీసులు భారీబందోబస్తు నిర్వహించారు. నవంబరు10న నిర్వహించే రథోత్స వానికి వచ్చే భక్తులకు ఎలాంటిఇబ్బందులు లేకుం డా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ చైర్మన్ బొడ్డుపల్లి సదయ్య తెలిపారు.
స్వామివారిని మాజీఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, పెద్దపల్లి సీఐ ప్రవీణ్‌కుమార్ దర్శించుకున్నారు. కల్యాణం సందర్భంగా చిన్నారులు వేషధారణ, నృత్యాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో గ్రామ మాజీసర్పంచ్ రావిశెట్టికిషన్, మాజీ ఎంపీటీసీ పందిళ్ల లక్ష్మయ్య, బొక్కల సంతోష్, తలారి సాగర్‌పాల్గొన్నారు.