Peddapalli: ఘనంగా ముందస్తు క్రిస్మస్
ABN , Publish Date - Dec 25 , 2025 | 12:14 AM
పెద్దపల్లి కల్చరల్/రూరల్, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): స్థానికంగా, మండలంలోని కాసుల పల్లిలో ఉన్న ట్రినిటి పాఠశాలలో ముందస్తుక్రిస్మస్ వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు.
పెద్దపల్లి కల్చరల్/రూరల్, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): స్థానికంగా, మండలంలోని కాసుల పల్లిలో ఉన్న ట్రినిటి పాఠశాలలో ముందస్తుక్రిస్మస్ వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సాంఠా, దేవదూతల వేషదార ణలతో పాఠశాలకు హాజరయ్యారు. పాఠశాలను పండు గ వాతావరణాన్ని ప్రతిబింబించేలా అలకరించారు. యేసుక్రీస్టు జననం గురించి నాటకం ప్రదర్శించారు. కార్యక్రమంలో విద్యాసంస్థల వ్యవస్థాపక చైర్మన్ దాసరి మనోహర్‌రెడ్డి, చైర్మన్ దాసరి ప్రశాంత్‌రెడ్డి, అకాడమిక్ డైరెక్టర్ దాసరిమమతారెడ్డి ముఖ్యఅతిథులుగా పాల్గొ న్నారు. అవినాష్, ఎం భూదేవి, ఏ శ్యామల, సతీష్ కుమార్, సమ్మయ్య, సౌందర్య మౌనిక, మంగ, పోషకులు పాల్గొన్నారు.
పాలకుర్తి: జీడీ నగర్ గ్రామ పంచాయతీ పరిధిలోని యూనివర్సల్ ఐఐటి, నీట్ ఫౌండేషన్ పాఠశాలలో బుధవారం ముందస్తుక్రిస్మస్ సంబరాలు ఘనంగా జరుపు కున్నారు. విద్యార్థులు నృత్యా లు, ఉపన్యాసాలతో పండుగ విశిష్టతను తెలియజేశారు. కరస్పాండెంట్ ఇస్మాయిల్, ప్రధానాచార్యులు సయ్యద్ అఫ్జల్ పండగ విశిష్టతను తెలియజేస్తూ భారతీయు లంతా దండలోని పూలమాలలాగా కలిసిమెలసి ఉంటూ ఆదర్శంగా నిలవాలని అన్నారు. క్రిస్మస్‌చెట్టు అలంకరణ పాఠశాల ప్రాంగణానికి కొత్త శోభను సంతరించుకుంది.
వేడుకలకు సిద్ధమైన చర్చ్‌లు..
మంథని : క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని చర్చ్‌లను క్రైస్తవులు ముస్తాబు చేస్తున్నారు. మత పెద్దలు, పాస్టర్ల ఆధ్వర్యంలో స్తానిక సీయోను, మండలంలోని సీయోను, ఆర్‌సీఎం, బేతేలు, గ్లోరియస్ ప్రార్థన మందిరాలను వివిధ రంగులతో, విద్యుత్ దీపాలతో ముస్తాబు చేశారు. ఇప్పటికే కొద్దిరోజులుగా గ్రామాల్లో క్రైస్తవుల ఇండ్లలో క్యారల్స్‌తో సందడి చేస్తున్నారు. క్రిస్మస్ పండుగతోపాటు 30, 31వ తేదీల్లో ఉపవాస పూడికలతోపాటు జనవరి 1వ తేదీన నూతన సంవత్సర వేడుకలతో ముగించనున్నట్లు ఇంటర్నేషనల్ మిషన్స్ ఇండియా ఫీల్డ్ సెక్రెటరీ అంకరి కుమార్ తెలిపారు.
కోల్‌సిటీటౌన్: గోదావరిఖనిలోని పలు ప్రధాన చర్చిలు అందంగా ముస్తాబయ్యాయి. గాంధీనగర్‌లోని సీఎస్‌ఐ చర్చి, గౌతమినగర్‌లోని గ్లోరి యస్ మినిస్ర్తీస్ చర్చి, సెక్రెడ్ హార్ట్ చర్చి, ఫైవింక్లయిన్ సమీప జ్యోతి నగర్‌లోని చర్చిలతోపాటు మరికొన్ని చర్చిలను విద్యుత్‌దీపాలతో అలం కరించారు. అలాగే మార్కెట్ క్రిస్మస్‌కు కావాల్సిన అన్నిరకాల వస్తువులతో కలకల లాడింది. బుధవారం రాత్రి నుంచే బాలయేసుకు జోలపాటలు పాడటంనుంచి పండుగ మొదల వుతుందని చర్చి పాస్టర్లు పేర్కొంటున్నారు.