Share News

Peddapalli: బీసీలకు తక్షణమే 42శాతం రిజర్వేషన్లు కల్పించాలి

ABN , Publish Date - Nov 27 , 2025 | 12:48 AM

పెద్దపల్లిటౌన్‌, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): బీసీల ప్రయోజనాలను విస్మరించొద్దని, తక్షణమే 42శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం పెద్దపల్లి జిల్లాకేంద్రంలోని బస్టాండ్‌ చౌరస్తా వద్ద గల అంబేద్కర్‌ విగ్రహం ఎదుట బీసీ నాయకులతో కలిసి బీసీ జేఏసీ జిల్లాచైర్మన్‌ దాసరి ఉష జీవో ప్రతులను దహనం చేశారు.

Peddapalli: బీసీలకు తక్షణమే 42శాతం రిజర్వేషన్లు కల్పించాలి

పెద్దపల్లిటౌన్‌, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): బీసీల ప్రయోజనాలను విస్మరించొద్దని, తక్షణమే 42శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం పెద్దపల్లి జిల్లాకేంద్రంలోని బస్టాండ్‌ చౌరస్తా వద్ద గల అంబేద్కర్‌ విగ్రహం ఎదుట బీసీ నాయకులతో కలిసి బీసీ జేఏసీ జిల్లాచైర్మన్‌ దాసరి ఉష జీవో ప్రతులను దహనం చేశారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల విషయంలో రాష్ట్రప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై ఆమె తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం రెండేళ్లుగా బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చి, నేడు మోసం చేసిందని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, షాపుల బంద్‌ చేపట్టినా ప్రభుత్వం నుంచి స్పందన లేదన్నారు. ప్రభుత్వాల మొండి వైఖరికి నిరసనగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మలను దహనం చేస్తున్నామని తెలిపారు. ప్రజాస్వామ్యబద్ధంగా బీసీల ఓట్లతో గెలిచిన ప్రభు త్వాలు తమ మొండితనాన్ని వీడి, తక్షణమే రద్దు చేసిన జీవోను మళ్లీ అమలు చేయాలని, బీసీలకు 42శాతం రిజర్వేషన్లు వెంటనే కల్పించాలని డిమాండ్‌ చేశారు.

బీసీలకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగు తుందని, లేనిపక్షంలో ఆందోళన లను మరింత ఉధృతం చేస్తా మని హెచ్చరించారు. కార్యక్రమంలో బీసీ జేఏసీ జిల్లా వర్కింగ్‌ చైర్మన్‌ నల్లవెల్లి శంకర్‌, వైస్‌చైర్మన్‌ కొండి సతీష్‌, జిల్లా, మండల కన్వీనర్లు సలేంద్ర కొమ్రయ్య, బి భూమేష్‌, ఆసారి రాజయ్య యాదవ్‌,కన్న రమేష్‌ గౌడ్‌,తోట రాజ్‌కుమార్‌, నోమురి శ్రీధర్‌,బి.భూమయ్య, కొండయ్య, అలువాల రాజేందర్‌, కలవేన రాజేందర్‌, డి.అశోక్‌, జి.రమేష్‌ తోపాటు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 27 , 2025 | 12:48 AM