Peddapalli: వందశాతం పన్ను వసూళ్లు చేయాలి
ABN , Publish Date - Oct 23 , 2025 | 01:02 AM
ముత్తారం, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో వందశాతం ఇంటి పన్ను వసూళ్లు చేయాలని డీపీవో వీరబుచ్చయ్య సూచించారు.
ముత్తారం, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో వందశాతం ఇంటి పన్ను వసూళ్లు చేయాలని డీపీవో వీరబుచ్చయ్య సూచించారు. ముత్తారం ఎంపీడీవో కార్యాలయంలో మండలంలోని గ్రామపంచాయతీ కార్యదర్శులతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీపీవో మాట్లాడుతూ పన్ను వసూళ్లు సకాలంలో పూర్తి చేయాలన్నారు. గ్రామాల్లో వివిధ వ్యాపారాలు చేస్తున్న వారు ట్రేడ్ లైసెన్స్ తీసుకునేలా చూడాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో సురేష్, కార్యదర్శులు రాజేందర్, సంధ్య, జయపాల్, నరేష్ పాల్గొన్నారు.
కాల్వశ్రీరాంపూర్: గ్రామాల్లో వందశాతం పన్నులు వసూలు చేయాలని పెద్దపల్లి డీఎల్‌పీవో వేణుగోపాల్ పేర్కొన్నారు. బుధవారం మండలంలోని గంగారం, మొట్టపల్లి, తదితర గ్రామాల్లోని గ్రామపంచాయతీలను సందర్శించి రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీవో పూర్ణచందర్, ఎంపీవో ఆరీఫ్ హుస్సేన్, పంచాయతీ కార్యదర్శులు షాహబోద్దిన్, మహేందర్ రెడ్డి, భాగ్యలక్ష్మి తదితరులు ఉన్నారు.