ప్రశాంతంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు
ABN , Publish Date - Aug 22 , 2025 | 12:55 AM
గణేష్ నవరాత్రి ఉత్సవాలు శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని ఎస్పీ మహేష్ బి గీతే అన్నారు.
సిరిసిల్ల క్రైం, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): గణేష్ నవరాత్రి ఉత్సవాలు శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని ఎస్పీ మహేష్ బి గీతే అన్నారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గణేష్ మండపాల నిర్వాహకులతో ఎస్‌ఐలు, ఇన్‌స్పెక్టర్లు సమావేశమై ఏర్పాట్లపై సమీక్షించాలన్నారు. నిమాజ్జనం జరిగే ప్రదేశాలను గుర్తించి భద్రత ఏర్పాట్లు చేయాలన్నారు. గణేష్ మండపాల వద్ద, శోభాయాత్రలో డీజేలకు అనుమతి లేదన్నారు. పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించ డానికి చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో గంజాయి సరఫరా చేసే వ్యక్తు లను గుర్తించి కేసులు నమోదు చేయాలన్నారు. సెప్టెంబర్ 13న జరిగే జాతీయ మెగా లోక్‌అదాలత్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకునేలా అవ గాహన కల్పించాలన్నారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, పోలీసు అధికారులు పాల్గొన్నారు.