Share News

పంచాయతీ కార్యదర్శి దిష్టిబొమ్మ దహనం

ABN , Publish Date - Oct 22 , 2025 | 12:12 AM

కోనరావుపేట మండ లం నాగారం గ్రామంలో దీపావళి పండుగ రోజున కాషాయ జెండా తొలగించడంపై తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

పంచాయతీ కార్యదర్శి దిష్టిబొమ్మ దహనం

కోనరావుపేట, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి) : కోనరావుపేట మండ లం నాగారం గ్రామంలో దీపావళి పండుగ రోజున కాషాయ జెండా తొలగించడంపై తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నాగారం గ్రామ పంచాయతీ కార్యదర్శి మహమ్మద్‌ అప్సాన ఆదేశాల మేరకు గ్రామం లోని పొట్టిగుట్టపై ఆర్‌ఎస్‌ ఎస్‌ వలంటీర్లు ఏర్పాటు చేసిన కాషాయ జెండాను అనుమతి లేకుండా తొలగించారంటూ గ్రామస్థులు, స్థానిక యువకులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు గ్రామంలో పంచాయతీ కార్యదర్శి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా గ్రామస్థులు, ఆర్‌ఎస్‌ఎస్‌ నాయ కులు మాట్లాడుతూ హిందుత్వ భావోద్వేగాలకు, సాంస్కృతిక సంప్రదాయాలకు ప్రతీకగా భావించే కాషాయ జెండాను పవిత్రమైన దీపావళి పండుగ రోజున తొలగించడం జాతీ య సాంస్కృతిక సంప్రదాయాలను అవమానించడమేనని అన్నారు. తాము ఎలాంటి అనుమతులు లేకుండా జెండాను ఏర్పా టు చేయలేదని, దీనిని తొలగించడం భావోద్వేగాలను రెచ్చగొట్టడమే నని ఆరోపించారు. అనంతరం ఈ విషయమై తహసీల్దార్‌ వరలక్ష్మికి ఫిర్యాదు చేశారు. అనంతరం తొలగించిన పొట్టిగుట్టపై కాషాయ జెండాను తిరిగి ఎగురవేశారు.

Updated Date - Oct 22 , 2025 | 12:12 AM