ఎమ్మెల్యేను కలిసిన పంచాయతీ పాలకవర్గ సభ్యులు
ABN , Publish Date - Dec 18 , 2025 | 12:57 AM
మండలంలోని తాళ్ళల్లపల్లె గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు బుధవారం మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణను కలిశారు.
ఇల్లంతకుంట, డిసెంబరు 17(ఆంధ్రజ్యోతి): మండలంలోని తాళ్ళల్లపల్లె గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు బుధవారం మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణను కలిశారు. మానకొండూర్ నియోజకవర్గకేంద్ర కార్యాలయంలో కలువగా ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు. తాళ్ళల్లపల్లె గ్రామపంచాయతీగా ఇటీవలే ఏర్పడగా తొలిపాలకవర్గం కలిసికట్టుగా ఉండి గ్రామానికి అభివృద్ధి చేసుకోవాలని సూచించినట్లు ఎమ్మెల్యే సూచించినట్లు తెలిపారు. ఎమ్మెల్యేను కలిసినవారిలో సర్పంచ్ మీసాల కనుకరాజు, ఉపసర్పంచ్ గొర్ల కమలాకర్, వార్డుసభ్యులు కొలుపుల సందీప్, కామల్ల కవిత, గొర్ల శ్రీకాంత్, నూనె శ్రీనివాస్‌యాదవ్, మీసాల రవీందర్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఎంపీపీ రమణారెడ్డి, జిల్లా నాయకుడు మూడపెల్లి చందుతో పాటు గ్రామస్తులు ఉన్నారు.