పకడ్బందీగా పంచాయతీ ఎన్నికలు
ABN , Publish Date - Dec 05 , 2025 | 12:45 AM
గ్రామ పంచాయతీ ఎన్నికలు నిబంధనల ప్రకారం పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ రాణీకుముదిని ఆదేశించారు.
సిరిసిల్ల, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి) : గ్రామ పంచాయతీ ఎన్నికలు నిబంధనల ప్రకారం పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ రాణీకుముదిని ఆదేశించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై జిల్లాల కలెక్టర్లతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం నుంచి గరిమ అగ్రవాల్, జిల్లా సాధారణ ఎన్నికల పరిశీలకులు రవికుమార్‌తో కలిసి హాజరయ్యారు. పంచాయతీ ఎన్నికల ఫలితాల ప్రకటన నియ మాలు, ఏకగ్రీవ స్థానాలలో ఉప సర్పంచ్ ఎన్నిక, పోస్టల్ బ్యాలెట్ ఏర్పాటు, నామినేషన్లపై వచ్చే ఫిర్యాదులు, తదితర అంశాలపై ఎన్నికల కమిషనర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ రాణీ కుముదిని మాట్లాడుతూ వార్డు సభ్యులంతా ఏక గ్రీవంగా ఎన్నికైన గ్రామాలలో ఉప సర్పంచ్ నియామకం నిబంధనల ప్రకారం జరిగేలో చూడా లన్నారు. నామినేషన్ల ప్రక్రియ చివరి దశకు చేరు కున్నందున సంబంధిత రిపోర్టులు టి- పోల్‌లో పెండింగ్ లేకుండా నమోదు చేయాలన్నారు. ప్రతి గ్రామ పంచాయతీకి సంబంధించి వచ్చిన నామి నేషన్లలో చెల్లుబాటు నామినేషన్ వివరాలు నవీక రించాలని అన్నారు. పోస్టల్ బ్యాలెట్ కోసం వచ్చిన ప్రతి దరఖాస్తు పరిశీలించి తప్పనిసరిగా సౌకర్యం కల్పించాలని, ప్రతి మండలంలో పోస్టల్ బ్యాలెట్ ఫెసిలెటేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని సూచిం చారు. బ్యాలెట్ పేపర్ నిబంధనల ప్రకారం ముద్రిం చాలని అన్నారు. ఎన్నికల ప్రచార సమయంలో ఎటువంటి ఎన్నికల ప్రవర్తనా నియ మావళి ఉల్లంఘనలు జరుగకుండా పక్కా నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పంచాయతీ ఎన్నికల్లో ఒక్క ఓటు కూడా చాలా ముఖ్యంగా మారుతుందని, అధికారులు అప్ర మత్తంగా ఉంటూ అవసరమైన చర్యలు చేపట్టాలని అన్నారు. అనం తరం లా అండ్ ఆర్డర్ అదనపు డీజీపీ మహేష్ భగవత్ మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల సందర్భంగా నిర్వహించే తనిఖీలలో అక్రమంగా నగదు, మద్యం, ఆభరణాలను ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు తరలించే పక్షంలో నిబంధనల ప్రకారం సీజ్ చేయాలని, పోలింగ్ రోజు సరిహద్దు ప్రాంతాల్లో అంతరాష్ట్ర చెక్ పోస్ట్ ఏర్పాటు చేయాలని సూచించారు. ధాన్యం కొనుగోలు సీజన్ నడు స్తున్నందున రైతుల వద్ద నుంచి ఆధారాలు పరి శీలించాలని, పంట డబ్బులకు ఆధారాలు ఉంటే సీజ్ చేయవద్దని పేర్కొన్నారు. సమావేశంలో డీఆర్డీఓ శేషాద్రి, జడ్పీ డిప్యూటీ సీఈవో గీత, డీపీవో షరీఫు ద్దిన్, జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం తదిత రులు పాల్గొన్నారు.