ప్రశాంత వాతావరణంలో పంచాయతీ ఎన్నికలు
ABN , Publish Date - Nov 28 , 2025 | 12:32 AM
జిల్లాలో గ్రామపంచాయితీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసులు సన్నద్ధం కావాలని ఎస్పీ మహేస్ బీ గీతే ఆదేశిం చారు.
సిరిసిల్ల రూరల్, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో గ్రామపంచాయితీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసులు సన్నద్ధం కావాలని ఎస్పీ మహేస్ బీ గీతే ఆదేశిం చారు. సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీ స్ అధికారులతో పంచాయతీ ఎన్నికలకు సంబం ధించి గురువారం సమీక్షా సమావేశాన్ని ఎస్పీ మహేష్ బీగీతే నిర్వహించారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గ్రామపంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా ప్రశాంత వాతావరణంలో, అవాం ఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా నిర్వ హిద్దామని తెలిపారు. జిల్లాలో మూడు విడుతల లో జరిగే గ్రామపంచాయతీ ఎన్నికలు పూర్తిస్థాయి పటిష్ట భద్రత ఏర్పాట్లతో ప్రశాంత వాతవరణం లో నిర్వహించాలన్నారు. ఎన్నికల నిర్వహణలో ఇప్పటికే అనుభవం ఉన్న అధికారులు, సిబ్బంది నూతనంగా డిప్లాయ్ అయిన సిబ్బందికి మార్గద ర్శనం చేస్తూ సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా వ్యవహరించే వారిపై కటినంగా వ్యవహరించాల న్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి పకడ్బందీ గా అమలు చేస్తూ అక్రమ మద్యం, నగదు, ఉచి తాల పంపిణీపై నిఘా ఉంచాలన్నారు. ప్రతి పోలీ స్ స్టేషన్ పరిధిలో వాహనాల తనిఖీలు, డైనమిక్ చెక్‌పోస్ట్‌లు పెట్టి తనిఖిలు చేపట్టాలని ఆదేశిం చారు. నామినేషన్ కేంద్రాలు, పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి, ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా ముంద స్తు చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలోని క్రిటికల్ పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఉంచుతూ అధికారులు తరచుగా పర్యటిస్తూ పరిస్థితులను నియంత్రణలో ఉంచాలని తెలిపారు. ఎన్నికల అనంతరం నిర్వహించే విజయోత్సవ ర్యాలీలపై కూడా ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. ప్రజల శాంతి భద్రతలకు భంగం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్నికల సందర్భంగా గతంలో ఎన్నికల సమయంలో నేరాలకు పాల్పడిన నేరస్థులతో పాటు, ఎన్నికల సమయంలో నేరాలకు పాల్పడేవారు, రౌడీషీటర్స్‌లపై, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై నిఘా ఉంచి, అవసర మైతే బైండోవర్ చేయాలని ఆదేశించారు.
సోషల్ మీడియాపై మరింత నిఘా
గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా జిల్లలో సోషల్ మీడియాపై నిఘా కటినతరం చేసి విద్వే షాలు రెచ్చగొట్టేలా, ప్రజలను తప్పుదోవ పట్టించే లా ప్రకటనలు పోస్ట్ చేసిన, షేర్ చేసినవారితో పాటు గ్రూప్‌అడ్మిన్‌లపై క్రిమినల్ కేసులు నమో దు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి, సీఐలు మొగిలి, శ్రీని వాస్, వీరప్రసాద్, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, రవి, నాగేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.