Share News

పంచాయతీ విధులను పకడ్బందీగా నిర్వహించాలి

ABN , Publish Date - Mar 14 , 2025 | 01:01 AM

గ్రామా ల్లో ప్రభుత్వ విధులను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా అన్నారు.

పంచాయతీ విధులను పకడ్బందీగా నిర్వహించాలి

సిరిసిల్ల కలెక్టరేట్‌, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): గ్రామా ల్లో ప్రభుత్వ విధులను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా అన్నారు. గురువారం కలె క్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో పంచాయతీ శాఖ పనితీరుపై పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. గ్రామాలలో పారి శుధ్య నిర్వహణ, పన్నుల వసూలు, ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖా స్తుల ఫీజుల వసూళ్లపై సమీక్ష నిర్వహించి పలు సూచ నలు చేశారు. కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా మాట్లాడు తూ గ్రామాల్లో ఉన్న రెసిడెన్షియల్‌, కమర్షియల్‌ భవనా లు, ఇండ్ల ఆస్తిపన్ను వంద శాతం వసూలు చేయాలని కలెక్టర్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి మరో 17రోజులు సమయం మాత్రమే ఉందని, ఆస్తిపన్ను వసూలు లక్ష్యాలను చేరు కోవడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా తక్కువ ఆస్తి పన్ను వసూలు చేసిన పంచాయతీ కార్యదర్శులను కలెక్టర్‌ ప్రత్యేకంగా సమీక్ష చేశారు. ఆస్తిపన్ను చెల్లించిన వారికి వెంటనే నోటీసులు జారీ చేయాలన్నారు. గ్రామాలలో అవసరమైన చోట ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఆస్తిపన్ను విలువ పెంచాల ని, రీ-అసెస్మెంట్‌ చేసి సరైన ఆస్తుల విలువ ప్రకారం పన్ను వసూలు చేయాలని సూచించారు. గ్రామాలలో వ్యాపారాల ట్రెడ్‌ లైసెన్స్‌ రెన్యువల్‌ సకాలంలో జరిగేలా చూడాలని, ట్రెడ్‌లైసెన్స్‌ లేకుండా ఎక్కడైనా వ్యాపారాలు నిర్వహిస్తే సీజ్‌ చేయాలని అన్నారు. ట్రెడ్‌ లైసెన్స్‌ రెన్యు వల్‌ పన్ను ముందుగా వసూలు చేయాల్సి ఉంటుందని అన్నారు. గ్రామాలలో మల్టీ పర్పస్‌ సిబ్బం ది వేతనాలు ఎప్పటికప్పుడు పంచాయతీ నిధుల నుంచి చెల్లించాలన్నారు. గ్రామాల లో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్‌ ఆదేశించారు.ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల పరిస రాలలో అపరిశుభ్రత అధికంగా గమనిస్తు న్నామని, దీని నియంత్రణకు చర్యలు తీసు కోవాలని తెలిపారు. గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ భవనాల పరిసరాల్లో పరిశుభ్రతపై శ్రద్ధ పెట్టాలన్నారు. పెండింగ్‌ ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులు క్లియర్‌ చేయాలన్నారు. ఆమో దించిన ఎల్‌ఆర్‌ఎస్‌. దరఖాస్తుల నుంచి ఫీజు వసూలు చేయాలని, దరఖాస్తుదారులను ఫాలోఅప్‌చేస్తూ మార్చి 31లోపు ఫీజు చెల్లించేలా చూడాలని అన్నారు. ఈ సమావేశంలో డీపీవో షరీపోద్దీన్‌, డీఎల్‌పీవో. నరేష్‌, డీటీసీపీవో ఆన్సర్‌, పంచాయతీ కార్యదర్శులు, సంబంధి త అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 14 , 2025 | 01:01 AM