శిథిలావస్థలో పంచాయతీ భవనం
ABN , Publish Date - Dec 14 , 2025 | 12:43 AM
మండలంలోని అశిరెడ్డిపల్లి గ్రా మపంచాయతీ భవనం శిథిలావస్థకు చేరింది.
చందుర్తి, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): మండలంలోని అశిరెడ్డిపల్లి గ్రా మపంచాయతీ భవనం శిథిలావస్థకు చేరింది. గ్రామపంచాయతీ సిబ్బంది భయంభయంగానే పరిపాలన కొనసాగిస్తున్నారు. భవనం శిథిలావస్థకు చే రడం, ఇరుకుగా సరైన సౌకర్యాలు లేకపోవడంతో గత పాలకవర్గ సభ్యులు, అధికారులు పలు సమస్యలు ఎదుర్కొన్నారు. మండలంలోని ఆశిరెడ్డిపల్లి గ్రామపంచాయతీ భవనాన్ని దాదాపు 1990 నిర్మించగా ప్రస్తుతం పూర్తిగా శిథిలావస్థకు చేరింది. శిథిలావస్థకు చేరి పైకప్పు పెచ్చులూడుతోంది. దీంతో గ్రామపంచాయతీ అధికారులు శిథిల భవనంలోనే భయంభయంగా పరిపా లన సాగించాల్సి వస్తోంది. ముఖ్యంగా వర్షాకాలంలో భవనం ఉరవడం, పెచ్చులూడుతుండడం సిబ్బంది కూర్చోవడానికి గదులు లేక ఇరుకుగా ఉం డడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. గతంలో పాలకవర్గ సమావేశాలు సైతం భవనం ఆవరణలో నిర్వహించుకోవాల్సిన పరిస్థితి ఉంది. 2016-17లో భవనం నిర్మాణానికి రూ.13లక్షలు మంజూరు కాగా గ్రామంలోని కొంత మంది పెద్ద మనుషులను భవన నిర్మాణానికి అడ్డంకులు చెప్పడంతో భవన నిర్మాణాం జరగలేదు. దీంతో మంజూరైన నిధులు రద్దుఅయ్యాయి. ప్రస్తుతం గ్రామపంచాయతీ నూతన పాలకవర్గంలోనైన భవన నిర్మాణం చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.