పద్మనగర్ పార్కు సుందరీకరణ పనులు పూర్తి చేయాలి
ABN , Publish Date - Aug 21 , 2025 | 11:47 PM
నగరంలోని పద్మనగర్ పార్కు సుందరీకరణ పనులను పూర్తి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ప్రపుల్‌దేశాయ్ అధికారులను ఆదేశించారు. గురువారం నగరంలోని పద్మనగర్, కట్టరాంపూర్ ప్రాంతాల్లో ఆయన పర్యటించారు.
కరీంనగర్ టౌన్, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): నగరంలోని పద్మనగర్ పార్కు సుందరీకరణ పనులను పూర్తి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ప్రపుల్‌దేశాయ్ అధికారులను ఆదేశించారు. గురువారం నగరంలోని పద్మనగర్, కట్టరాంపూర్ ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పద్మనగర్ చౌరస్తాలో రోడ్డు ప్రమాదకరంగా మారిందని, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మానేరు డ్యాం లోపల చెత్త వేయకుండా చూడాలన్నారు. కట్టరాంపూర్ నుంచి గౌతమీనగర్ వెళ్లే రోడ్డులో అసంపూర్తిగా ఉన్న డ్రైనేజీని పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఈఈలు యాదగిరి, సంజీవ్ కుమార్, డీఈ శ్రీనివాస్, లచ్చిరెడ్డి, శానిటేషన్ సూపర్‌వైజర్ శ్యామ్ పాల్గొన్నారు.