జీవనశైలిపై ఆధారపడే మన ఆరోగ్యం
ABN , Publish Date - Sep 28 , 2025 | 11:25 PM
జీవనశైలిపైనే మన ఆరోగ్యం ఆధారపడి ఉందని, మంచి జీవనశైలి, పౌష్టికాహారంతోనే గుండె పదిలంగా ఉంటుందని పోలీసు కమిషనర్ గౌస్ ఆలం అన్నారు.
సుభాష్‌నగర్, సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): జీవనశైలిపైనే మన ఆరోగ్యం ఆధారపడి ఉందని, మంచి జీవనశైలి, పౌష్టికాహారంతోనే గుండె పదిలంగా ఉంటుందని పోలీసు కమిషనర్ గౌస్ ఆలం అన్నారు. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ఆదివారం నగరంలోని మెడికవర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో చేపట్టిన 2కే వాక్‌థాన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుండె సంబంధిత వ్యాధులపై అవగాహన కల్పించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయన్నారు. అనంతరం ఆసుపత్రి వైద్యులు మాట్లాడుతూ చిన్న వయస్సులోనే గుండె జబ్బుల బారిన పడడానికి అనేక కారణాలు ఉన్నాయన్నారు. బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ లెవల్స్‌ను సాధారణ స్థాయిలో ఉంచుకుంటే గుండె జబ్బులు దూరమవుతాయన్నారు. సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ మాట్లాడుతూ వాక్‌థాన్‌కు జనరల్ ఫిజీషియన్స్, జనరల్ సర్జన్, ఆర్థోపెడిక్ సర్జన్స్, గైనకాలజిస్టు అసోసియేషన్లు, మాతా ల్యాబ్, పూర్ణిమ ఫెర్టిలిటీ, ఐసిస్, సిస్కో, ఎంజీఆర్ బ్లడ్‌బ్యాంకు, లాడిలిషియన్, ఆర్‌జీఏ సంస్థలు సహకారం అందించాయన్నారు. వైద్యులు అనీష్‌పబ్బ, వాసుదేవరెడ్డి, వినయ్‌కుమార్, విష్ణువర్దన్‌రెడ్డి లోకేష్ బీరకాయల, తాహా, దిలీప్‌రెడ్డి, వేణుగోపాల్, నాగరాజు, రాజీవ్‌రెడ్డి, సత్యనారాయణ, పల్లవి, ప్రియాంక, మార్కెటింగ్ మేనేజర్ కోట కరుణాకర్, హెచ్‌ఆర్ మేనేజర్ ఈశ్వర్, ఆపరేషన్స్ మేనేజర్ సాయిచరణ్ పాల్గొన్నారు.