19 వరకు బడిబాట కార్యక్రమాల నిర్వహణ
ABN , Publish Date - Jun 07 , 2025 | 12:58 AM
రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఈనెల 19వ తేదీవరకు ప్రభుత్వ ఉపాధ్యాయులు స్థానిక నాయకులతో కలిసి బడిబాట కార్యక్రమాలను నిర్వహించి ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలందరు అడ్మిషన్‌లు పొందేలా ప్రత్యేకమైన దృష్టి సారించాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా అధికారులను ఆదేశించారు.
సిరిసిల్ల కలెక్టరేట్, జూన్ 6 (ఆంధ్రజ్యోతి) : రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఈనెల 19వ తేదీవరకు ప్రభుత్వ ఉపాధ్యాయులు స్థానిక నాయకులతో కలిసి బడిబాట కార్యక్రమాలను నిర్వహించి ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలందరు అడ్మిషన్‌లు పొందేలా ప్రత్యేకమైన దృష్టి సారించాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాల పై సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా ఉన్న బాలబాలికల ను తప్పనిసరిగా పాఠశాలలో చేర్పించేందుకు కృషి చేయాలన్నారు. బడిబాట కార్యక్రమాల్లో భాగంగా ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ టీచర్ లు, ఆయాలు, ఏఎన్‌ఎంలు,వీవోలు కలిసి ఒక టీంగా ఏర్పడి ప్రతిఇం టికి వెళ్లి పిల్లలందరిని తప్పనిసరిగా ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా బాలికలను చేర్పించే విధంగా ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. జిల్లాలో ప్రభుత్వ పాఠశాల ల్లో క్వాలిఫైడ్ నూతన ఉపాధ్యాయుల ద్వారా అందిస్తున్న మెరుగైన నాణ్యమైన విద్యాభోధన, వసతులు, ఉచిత పుస్తకాలు, యూనిఫాంలు, మధ్యాహ్నభోజనం, వివిధ పోటీ పరీక్షలు, జేఈఈ, నీట్ ఎంట్రన్స్ పరీ క్షల కోచింగ్, డిజిటల్ క్లాస్‌రూంలు తరగతి గదులు విశాలమైన క్రీడా మైదానాలపై ఉపాధ్యాయులు పిల్లల తల్లిదండ్రులకు వివరించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న బాలబాలికలు ఎక్కడ డ్రాఫ్ అవుట్ కాకుండా చూడాలన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ అఽధికారులు సైతం బడిబాట కార్యక్రమాల్లో పాల్గొంటూ బాలి కలు ఎక్కడ విద్యకు దూరం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. తల్లిదండ్రులకు విద్య పట్ల ప్రభుత్వం పాఠశాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాలన్నారు. పదవ తరగతి ముగిసిన త్వరాత ఇంటర్మీడియేట్ చదివేలా వారి తల్లిదండ్రులకు అవగాహన కార్యక్ర మాలను నిర్వహించాలన్నారు. ప్రతి మండల పరిధిలో సూపర్‌వైజర్ వారి పరిధిలో గల బాలికలపై శ్రద్ధ వహిస్తూ వారు చదువు కొన సాగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో పంచాయితీ కార్యదర్శులు, పట్టణాలల్లో వార్డు అధికారులతో సమన్వ యం చేసుకుంటూ ఎక్కడ బాలకార్మికులు తప్పకుండా చర్యలు తీసు కోవాలని పిల్లలంతా తప్పనిసరిగా పాఠశాలలో నమోదు కావాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న పరిశ్రమలు, హోటల్స్, ఇటుక బట్టీలను తనిఖీ చేసి ఎవరైనా బాలకార్మికులు కనిపిస్తే వారిని వెంటనే పాఠశాలల్లో చేర్పించాలని ఆదేశించారు. వలస కూలీల పిల్లలు సైతం పాఠశాలలో నమోదు అయ్యేలా అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఉపాధిహామీ కూలీల కింద నమోదైన జాబ్‌కార్డులు కలిగిన ప్రతి కుటుంబంలో పిల్లలు చదువుకుంటున్నారో లేదో పరిశీలిం చాలన్నారు. పిల్లలు చదువుకోని పక్షంలో వెంటనే వారిని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు నమోదు చేయాలన్నారు. ఈ సమావేశంలో డీఆర్‌డీవో శేషాద్రి, జిల్లా వైద్యాధికారి డాక్టర్ రజిత, విద్యాశాఖ అధికా రులు పాల్గొన్నారు.