ఆపరేషన్ సిందూర్‌తో శత్రు దేశాలకు వణుకు..
ABN , Publish Date - May 24 , 2025 | 12:50 AM
ఆపరేషన్ సిందూర్ కార్యక్రమం తో శత్రుదేశాల వెన్నులో వణుకు పుట్టిందని బీజేపీ సీనియర్ నాయకులు ప్రతాప రామకృష్ణ, చెన్నమనేని వికాస్‌రావు అన్నారు.
వేములవాడ, మే 23 (ఆంధ్రజ్యోతి) : ఆపరేషన్ సిందూర్ కార్యక్రమం తో శత్రుదేశాల వెన్నులో వణుకు పుట్టిందని బీజేపీ సీనియర్ నాయకులు ప్రతాప రామకృష్ణ, చెన్నమనేని వికాస్‌రావు అన్నారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ కార్యక్రమం విజ యవంతం అయిన సందర్భంగా శుక్రవారం బీజేపీ ఆధ్వర్యంలో వేముల వాడ పట్టణంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు మాట్లా డుతూ ఆపరేషన్ సిందూర్ భారతదేశ ప్రజల మనోబలాన్ని ప్రతిబింబిం చిందని, సైనికులకు మద్దతుగా, వారికి గౌరవసూచకంగా పార్టీలకతీతంగా తిరంగా యాత్రను చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, పట్టణ అధ్యక్షుడు రాపల్లి శ్రీధర్, రేగుల మల్లికార్జున్, అల్లాడి రమేష్, ఎర్ర మహేష్ తదితరులు పాల్గొన్నారు.