Share News

పకడ్బందీగా ‘ఆపరేషన్‌ ముస్కాన్‌’

ABN , Publish Date - Jul 11 , 2025 | 01:03 AM

జిల్లాలో పకడ్బందీగా ఆపరేషన్‌ ము స్కాన్‌ నిర్వహిస్తున్నామని, గత 10రోజుల్లో 31మంది పిల్లలను రెస్క్యూ చేశామ ని ఎస్పీ మహేశ్‌ బి. గీతే అన్నారు.

పకడ్బందీగా ‘ఆపరేషన్‌ ముస్కాన్‌’

సిరిసిల్ల క్రైం, జూలై 10(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పకడ్బందీగా ఆపరేషన్‌ ము స్కాన్‌ నిర్వహిస్తున్నామని, గత 10రోజుల్లో 31మంది పిల్లలను రెస్క్యూ చేశామ ని ఎస్పీ మహేశ్‌ బి. గీతే అన్నారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆపరేషన్‌ ముస్కాన్‌ బృందంలో ఉన్న అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెస్క్యూ చేసిన పిల్లలను సీడబ్ల్యూసీ ముందు హాజరుపరిచి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సె లింగ్‌ ఇచ్చి అప్పగించామన్నారు. 18ఏళ్లలోపు పిల్లలను పనిలో పెట్టుకొని వారితో పనిచేయిస్తున్న వారిపై 3కేసులు నమోదుచేశారన్నారు. సమావేశంలో సిరిసిల్ల ఆర్‌డీఓ వెంకటేశ్వర్లు, సిడబ్ల్యూసి చైర్‌పర్సన్‌ కంటం అంజయ్య, సిఐలు నాగేశ్వర్‌ రావు, ఎస్‌ఐలు లింబాద్రి, లక్‌పతి, సహాయలేబర్‌ అధికారి నజీర్‌ మహ్మద్‌, మెడి కల్‌అండ్‌హెల్త్‌ అధికారి నయిమ్‌ జహార్‌, విద్యాశాఖ అధికారి శైలజ, ఏఎస్‌ఐ ప్రమీల, మహిళా సాధికారత సమన్వయకర్త రోజా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 11 , 2025 | 01:03 AM