Share News

ఆపరేషన్‌ కగార్‌ను ఆపి శాంతి చర్చలు జరపాలి

ABN , Publish Date - May 01 , 2025 | 12:01 AM

ఆపరేషన్‌ కగార్‌ను ఆపాలని వామపక్ష, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు.

ఆపరేషన్‌ కగార్‌ను ఆపి శాంతి చర్చలు జరపాలి

సిరిసిల్ల టౌన్‌, ఏప్రిల్‌ 30 (ఆంధ్రజ్యోతి) : ఆపరేషన్‌ కగార్‌ను ఆపాలని వామపక్ష, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌ చౌరస్తా వద్ద వామపక్ష, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆపరేషన్‌ కగార్‌ను ఆపాలని, మావోయిస్టులతో శాంతి చర్చలు వెంటనే జరపాలని డిమాండ్‌ చేస్తూ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వామపక్ష, ప్రజా సంఘాల నాయకులు మాట్లాడారు. కర్రెగుట్ట ప్రాంతం నుంచి అన్ని సాయుధ పోలీసు బలగాలను ఉపసంహరించాలని, అరెస్టు చేసిన ఆదివాసీ గిరిజనులను వదిలిపెట్టాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అపరేషన్‌ కగార్‌ను ఉపసంహరించుకోవాలన్నారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు, సీపీఐ పట్టణ కార్యదర్శి పంతం రవి, సీపీఐఎంల్‌ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సోమిశెట్టి దశర్థం, టీజేఎస్‌ జిల్లా అధ్యక్షుడు బొజ్జ కనకయ్య, భారత్‌ బచావో కమటి సభ్యుడు సకినాల అమర్‌, బీఎస్పీ రాష్ట్ర నాయకుడు అంకని భాను, మాల మహానాడు జాతీయ కార్యదర్శి రాగుల రాము, పీడీఎస్‌యూ మాజీ నాయకులు చెట్కూరి అంజనేయులుగౌడ్‌, ప్రజా సమీకృత కమిటి సభ్యుడు గొట్టె రవి, నాయకులు మంత్రి చంద్రయ్య, దర్శనం కిషన్‌, బొడ్డు రాములు, వేమండ్ల రమేష్‌ పాల్గొన్నారు.

Updated Date - May 01 , 2025 | 12:01 AM