ఆపరేషన్ కగార్‌ను వెంటనే నిలిపివేయాలి
ABN , Publish Date - May 25 , 2025 | 12:48 AM
మావోయిస్టు లను ఏరివేసేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరే షన్ కగార్‌ను వెంటనే నిలి పివేసి వారితో చర్చలు జర పాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు స్కైలాబ్‌బాబు డిమాండ్ చేశారు.

సిరిసిల్ల రూరల్, మే 24 (ఆంధ్రజ్యోతి): మావోయిస్టు లను ఏరివేసేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరే షన్ కగార్‌ను వెంటనే నిలి పివేసి వారితో చర్చలు జర పాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు స్కైలాబ్‌బాబు డిమాండ్ చేశారు. సిరిసిల్ల పట్టణం బీవైనగర్‌లోని అమృత్‌లాల్‌శుక్లా కార్మిక భవనంలో శనివారం సీపీ ఎం జిల్లా కమిటీ సమావే శం జిల్లా కార్యదర్శి మూషం రమేష్ అధ్యక్ష తన జరిగింది. సమావేశానికి హాజరైన స్కై లాబ్‌బాబు మాట్లాడుతూ ఛతీస్‌గఢ్ రాష్ట్రం లోని నారాయణపూర్ జిల్లాలోని అబూజ్‌మా డ్ అడవుల్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమి టీ కార్యదర్శి నంబాల కేశవరావు అలియన్ బస్వరాజుతోపాటు 27మంది నక్సలైట్లను కేంద్ర ప్రభుత్వ పోలీసు బలగాలు ఎన్‌కౌంట ర్ పేరుతో కాల్చిచంపడాన్ని సీపీఎం తీవ్రం గా ఖండిస్తోందన్నారు. బీజేపీ ప్రభుత్వం తన క్రూరమైన వైఖరిని మార్చుకొని మావోయిస్టు లతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. మావోయిస్టులు చర్చలు జరపాలంటూ అనేక సార్లు కేంద్ర ప్రభుత్వానికి విన్నపాలను చేసి నా నిర్లక్ష్యం చేసిందన్నారు. కేంద్రంలో అధికా రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఛతీస్‌గఢ్ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చల ద్వారా పరిష్కారా న్ని కనుగొనే మార్గాన్ని వదిలేసి, హింసతో కూడిన విధానాన్ని అనుసరిస్తోందని, ఇవి ముమ్మాటికీ కేంద్ర ప్రభుత్వ హత్యలేనని అన్నారు.కేంద్ర హోంశాఖ మంత్రి, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిలు చేసి న ప్రకటనల్లో చర్చలు అవసరం లేదని పేర్కొనడం ఫాసిస్టు లక్ష ణాలను ప్రతిబింబిస్తున్నాయని, ఇవి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం గా ఉన్నాయన్నారు. మావోయిస్టు ల రాజకీయ విధానంపై సీపీఎం వ్యతిరేకంగా ఉన్నప్పటికీ చర్చల కోసం వచ్చిన వారి విజ్ఞప్తిని ప్రభుత్వం అంగీకరించి తక్షణమే పారామిలిటరీ పోలీసు కార్యకలా పాలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభు త్వం నరమేధాన్ని నిలిపివేసి శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎగమంటి ఎల్లారెడ్డి, జివ్వాజి విమ ల, కోడం రమణ, మాల్లారపు అరుణ్ కుమా ర్, సభ్యులు ముక్తికాంత అశోక్, అన్నల్‌దాస్ గణేష్, సూరం పద్మ, గురజాల శ్రీధర్, మల్లా రపు ప్రశాంత్, శ్రీరాముల రమేష్‌చంద్ర తది తరులు పాల్గొన్నారు.