Share News

కొనసాగుతున్న వాలీబాల్‌ శిక్షణ శిబిరం

ABN , Publish Date - Dec 12 , 2025 | 01:33 AM

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం మినీ స్టేడియంలో జిల్లా వాలీబాల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో చేపట్టిన రాష్ట్ర జూనియర్స్‌ వాలీ బాల్‌ బాలబాలికల జట్ల శిక్షణ శిబిరం కొనసాగుతోంది.

కొనసాగుతున్న వాలీబాల్‌ శిక్షణ శిబిరం

సిరిసిల్ల టౌన్‌, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి) : రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం మినీ స్టేడియంలో జిల్లా వాలీబాల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో చేపట్టిన రాష్ట్ర జూనియర్స్‌ వాలీ బాల్‌ బాలబాలికల జట్ల శిక్షణ శిబిరం కొనసాగుతోంది. శిబిరాన్ని గురువారం వాలీబాల్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు గజ్జెల్ల రమేష్‌ పరిశీలించారు. రాష్ట్ర జట్టులో బాలికలు 18, బాలురు 18 మంది శిక్షణ పొందుతున్నారు. ఈ నెల 15న రాజ స్థాన్‌లో జరగనున్న జాతీయ స్థాయి జూనియర్స్‌ బాలబాలికల వాలీబాల్‌ పోటీలకు రాష్ట్ర జట్టులో బాలికలు 12, బాలురు 12 మందిని ఎంపిక చేసి ఈ నెల 13న రాజస్థాన్‌కు పంపిస్తారు. జిల్లా వాలీబాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు చెన్నమనేని శ్రీకు మార్‌, ఉపాధ్యక్షుడు చింతకింది శ్యాంకుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 12 , 2025 | 01:33 AM