చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి
ABN , Publish Date - Dec 31 , 2025 | 11:40 PM
యువత చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా ఉన్నత లక్ష్యసా ధనకు కృషి చేయాలని ఏఎస్పీ రుత్విక్ సాయి అన్నారు.
రుద్రంగి, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): యువత చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా ఉన్నత లక్ష్యసా ధనకు కృషి చేయాలని ఏఎస్పీ రుత్విక్ సాయి అన్నారు. రుద్రంగి మండలం దేగవత్‌తాండా గ్రామంలో ప్రజలు, యువకులతో సమావేశం నిర్వహించి సైబర్ నేరాలు, గంజాయి, డ్రంకెన్ డ్రైవ్ చట్టాలపైన అవగాహన కల్పిం చారు. అనంతరం యువకులకు వాలీబాల్ కిట్లను అంద జేశారు. ఈ సందర్బంగా ఏఎస్పీ రుత్విక్ సాయి మాట్లా డుతూ విజుబుల్ పోలీసింగ్‌లో బాగంగా విలేజ్ పోలీస్ అధికారులు తరచూ గ్రామాలు పర్యటిస్తూ ప్రజలతో మమేకమవుతూ ప్రజలకు సైబర్‌నేరాలు, ట్రాఫిక్ నియ మాలు, బెట్టింగ్ యాప్స్ వంటటి అంశాలపై అవగాహ న కల్పించాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతీరోజు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించాలన్నారు. నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతంగా జరిగేల చూడాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో సీఐ వెంకటేశ్వ ర్లు, ఎస్సై శ్రీనివాస్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
పోలీస్‌స్టేషన్ తనిఖీ..
మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌ను వేములవాడ ఏఎస్పీ రుత్విక్‌సాయి బుధ వారం తనిఖీ చేశారు. స్టేషన్ పరిధిలో న మోదవుతున్న కేసుల వివరాలు, స్టేషన్ రి కార్డులు తనిఖీ చేశారు. ప్రజా ఫిర్యాదుల్లో ఎటువంటి జాప్యం లేకుండా స్పందించా లన్నారు. ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలన్నారు. భాదితుల ఫిర్యాదుల పట్ల తక్షణమే స్పందించి ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో చందుర్తి సర్కిల్ సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై శ్రీనివాసులు పాల్గొన్నారు.