చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి
ABN , Publish Date - Jun 27 , 2025 | 12:14 AM
విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి చదువుపై దృష్టి సారించి భవిష్యత్తులో ఉన్నత చదువులు చదువుకోవాలని సిరిసిల్ల సీనియర్ సివిల్ జడ్జి రాధిక జైస్వాల్ కోరారు.
సిరిసిల్ల రూరల్, జూన్ 26 (ఆంధ్రజ్యోతి) : విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి చదువుపై దృష్టి సారించి భవిష్యత్తులో ఉన్నత చదువులు చదువుకోవాలని సిరిసిల్ల సీనియర్ సివిల్ జడ్జి రాధిక జైస్వాల్ కోరారు. సిరిసిల్ల జిల్లా ప్రధాన న్యాయమూర్తి జిల్లా న్యాయసేవ అధికార సంస్థ చైర్‌పర్సన్ నీరజ ఆదేశాల మేరకు గురువారం సిరిసిల్ల పట్టణంలోని నెహ్రూనగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రపంచ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా న్యాయ విజ్ఞాన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సీనియర్ సివిల్ జడ్జి రాధికజైస్వాల్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే మత్తు పదార్థాలకు అలవాటు అవుతుందని, దీనికి విద్యార్థులు దూరంగా ఉండి చదువుపైనే దృష్టి సారించాలన్నారు. మత్తు పదార్థాలు వాడకం వల ఏర్పడే అనర్థాల గురించి, మత్తు ద్వారా చేస్తున్న తప్పులు చేసినందుకు పడే శిక్షలపై అవగాహన కల్పించారు. విద్యార్థులు చదువుపైనే దృష్టి సారించి భవిష్యత్తులో ఉన్నత చదువులు చదువుకుని సమాజంలో మంచి పేరును తెచ్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు జూపల్లి శ్రీనివాసరావు, లోక్ అదాలత్ సభ్యులు చింతోజు భాస్కర్, అడెపు వేణు, సైకియాట్రిస్ట్ డాక్టర్ ప్రవీణ్, డిప్యూటీ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ మల్లేష్ యాదవ్, రిజర్వ్ ఎస్‌ఐ సాయి కిరణ్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నాగుల భాగ్యరేఖ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.