భగవద్గీతను చదివి ఆత్మశుద్ధి చేసుకోవాలి
ABN , Publish Date - Dec 03 , 2025 | 12:45 AM
భగవద్గీతను చదివి అర్థం చేసుకొని ఆత్మ శుద్ధిని చేసుకోవాలని సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు అన్నారు.
సిరిసిల్ల టౌన్, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి) : భగవద్గీతను చదివి అర్థం చేసుకొని ఆత్మ శుద్ధిని చేసుకోవాలని సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రం లోని గీతనగర్ శ్రీ సద్గురు మలయాళ గీత ఆశ్రమంలో సిరిసిల్ల గీత ప్రచార సేవా సమి తి ఆధ్వర్యంలో గీత జ్థాన యజ్ఞం ప్రవచనాల ముగింపు సమావేశం సేవా సమితి అధ్య క్షుడు కోడం నారాయణ అధ్యక్షతను జరిగింది. ముఖ్య అతిథి ఆర్డీవో, సేవా సమితి సభ్యు లు వారం రోజులుగా ప్రవచనాలు చేసిన బ్రహ్మచారి శ్రీఅక్షయ చైతన్న స్వామీజీని ఘనం గా సన్మానించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి ఆర్డీవో మాట్లాడారు. భక్తులకు గత వారం రోజులుగా స్వామిజీ చక్కని సందేశాత్మకమైన ప్రవచనాలు చేశారని అన్నారు. భగ వద్గీత మనిషి ముక్తికి సాధనమని మనిషి మార్పునకు సాధనమన్నారు. అంతకుముందు భగవద్గీతపై నిర్వహించిన పోటీలలో విజేతలకు ఆర్డీవో బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల గీత ప్రచార సమితి ప్రధాన కార్యదర్శి జనపాల శంకరయ్య, సభ్యు లు, భక్తులు, విద్యార్థులు పాల్గొన్నారు.