Share News

ఆయిల్‌పామ్‌ సాగు లక్ష్యాలను సాధించాలి

ABN , Publish Date - Dec 21 , 2025 | 12:30 AM

ఆయిల్‌పామ్‌ సాగు లక్ష్యాలను పూర్తిచేయడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని రైతులకు ఎరువుల సరఫరా విషయంలో ఇబ్బందులు దూరం చేసేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ రూపొందించిన ఫర్టిలైజర్‌ యాప్‌పై రైతులకు అవగాహన కల్పించాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ అధికారులను ఆదేశించారు.

ఆయిల్‌పామ్‌ సాగు లక్ష్యాలను సాధించాలి

సిరిసిల్ల కలెక్టరేట్‌, డిసెంబరు 20(ఆంధ్రజ్యోతి): ఆయిల్‌పామ్‌ సాగు లక్ష్యాలను పూర్తిచేయడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని రైతులకు ఎరువుల సరఫరా విషయంలో ఇబ్బందులు దూరం చేసేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ రూపొందించిన ఫర్టిలైజర్‌ యాప్‌పై రైతులకు అవగాహన కల్పించాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ అధికారులను ఆదేశించారు. సిరిసిల్ల సమీకృత కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో శనివారం ఫర్టిలైజర్‌ యాప్‌, ఆయిల్‌పామ్‌ సాగు విస్తీర్ణ లక్ష్యాల సాధనపై వ్యవసా య అధికారులు, ఉద్యానవన శాఖ, సింగిల్‌విండో సీఈవోలకు అవగాహన సదస్సులను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ మాట్లా డారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ఫర్టిలైజర్‌ యాప్‌తో ఉపయోగాలను రైతులకు వివరించాలని పేర్కొన్నారు. అలాగే రైతుల ఫోన్‌లలో యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసి దానిని ఎలా వినియోగించాలో యాప్‌లోనే రైతులకు చూపించి అవగహన కల్పించాలన్నారు. అలాగే యాప్‌లో ఎరువుల వివ రాలు, ఎక్కడ అందుబాటులో ఉందో అనే సమాచారం తెలుస్తుం దని, వారికి కేటాయించిన ఎరువులు అందుబాటులో ఉంటాయ నే వివరాలు తెలుపాలని సూచించారు. ఎక్కడి నుంచి అయినా రైతులు తమ పట్టాదారు పాస్‌ పుస్తకం వివరాలతో లాగిన్‌ అయితే వారికి పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుందని స్పష్టం చేశారు. ఫర్టిలైజర్‌ దుకాణాల యజమానులతో పాటు డీలర్లు ఈ యాప్‌పై రైతులకు అవగాహన కల్పించేందుకు ఒక రిని నియమించాలని, వారు రైతులకు యాప్‌లో బుకింగ్‌పై సహాయం చేయాలని సూచించారు.

ఆయిల్‌పామ్‌ లక్ష్యాన్ని చేరుకోవాలి..

వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులు, సింగిల్‌ విండోల సీఈవోలకు కేటాయించిన లక్ష్యాలను చేరుకోవాలని ఆదేశించారు. ఆయిల్‌పామ్‌ సాగు విస్తీర్ణ పెరగడం వల్ల రైతులకు అధిక లాభం జరగడంతోపాటు దేశానికి కూడా ఎంతో మేలు చేకూరు తుందని తెలిపారు. ఆయిల్‌పామ్‌ సాగుపై ఆసక్తిగా ఉన్న రైతు ల వివరాలు వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారు లకు తెలియజేయాలని సూచించారు.పలువురు వ్యవ సాయాధికారులు, ఉద్యానవన అధికారులు, సింగిల్‌ విండోల సీఈవోలు ఆయిల్‌పామ్‌ పెంపునకు కృషి చేస్తుండడంతో వారిని అభినందించారు. ఆయిల్‌పా మ్‌ సాగు చేసేందుకు ఆసక్తి ఉన్న రైతలకు జిల్లాలో ఇప్పటికే పంటల ఉత్పత్తులు వచ్చిన రైతలు క్షేత్ర స్థాయిలో చూపించాలన్నారు. అలాగే సిద్దిపేట జిల్లా లోని నర్మెట గ్రామంలో ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీ సంద ర్శనకు తీసుకెళ్లాలని ఆదేశించారు. ఆయిల్‌పామ్‌ సా గుపై సింగిల్‌విండోల్లో రైతులకు అవగాహన సదస్సు లు నిర్వహించాలని సూచించారు. వ్యవసాయ, ఉద్యా నవన శాఖల అధికారులు, సింగిల్‌విండోల సీఈవో లు సమన్వయంతో విజయవంతంచేమాలని కోరారు.

రైతులకు ఉత్తమ సేవలు అందించాలి

వేములవాడ, నాంపెల్లి, గంభీరావుపేట, అల్మాస్‌పూర్‌, సనుగు ల, ఇల్లంతకుంట, పీఏసీఎస్‌లకు ఎంపిక కాగా అయా పీసీఎస్‌ ల సభ్యులను అభినందించారు. రైతులకు ఉత్తమ సేవలు అంది స్తూ వ్యాపారంలోనూ అభివృద్ది చేందాలని అక్షాంక్షించారు. ఈ అవగహన సదస్సులో జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్‌ బేగం, ఉద్యానవన శాఖ అధికారి శరత్‌ బాబు, జిల్లాసహాకార అధికారి రామకృష్ణతదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 21 , 2025 | 12:31 AM