ఆయిల్ పామ్ సాగు లాభదాయకం
ABN , Publish Date - Nov 11 , 2025 | 11:50 PM
రైతులు ఆయిల్ పామ్ సాగుచేస్తే లాభదాయకంగా ఉంటుందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జె భాగ్యలక్ష్మి, జిల్లా ఉద్యాన శాఖ అధికారి పి కమలాకర్‌రెడ్డి అన్నారు. కొత్తపల్లి మండలంలోని కమాన్‌పూర్‌లో సిరిపురం పర్శరాములుకు చెందిన ఆయిల్ ఫామ్ సాగును వారు మంగళవారం పరిశీలించారు.
భగత్‌నగర్, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): రైతులు ఆయిల్ పామ్ సాగుచేస్తే లాభదాయకంగా ఉంటుందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జె భాగ్యలక్ష్మి, జిల్లా ఉద్యాన శాఖ అధికారి పి కమలాకర్‌రెడ్డి అన్నారు. కొత్తపల్లి మండలంలోని కమాన్‌పూర్‌లో సిరిపురం పర్శరాములుకు చెందిన ఆయిల్ ఫామ్ సాగును వారు మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయిల్ పామ్ తోటలో అంతర పంటగా కంది సాగు చేసుకోవచ్చన్నారు. ఆయిల్ పామ్ సాగుకు ఎకరానికి ఒక్కో సంవత్సరానికి 4,200 రూపాయల చొప్పున ప్రభుత్వం నాలుగు సంవత్సరాల పాటు ప్రోత్సాహకం ఇస్తుందని తెలిపారు. లోహియా ఎడిబుల్ ఆయిల్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ రైతులకు మొక్కలు అందించి, గెలలు కొనుగోలు చేస్తోందన్నారు. కొన్ని 14 రోజుల్లోపు డబ్బులు చెల్లిస్తుందని చెప్పారు. రైతులు ఆయిల్ ఫామ్ సాగు చేపట్టి అధిక ఆదాయం పొందాలనిన సూచించారు. కార్యక్రమంలో వ్యవసాయ సహాయ సంచాలకులు కె రణధీర్‌రెడ్డి, వ్యవసాయ అధికారి కె సంతోష్, ఉద్యాన అధికారి వి ఐలయ్య, ఏఈవో రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు.