సార్వత్రిక సమ్మెకు అధికారులు సహకరించాలి
ABN , Publish Date - Jun 28 , 2025 | 12:48 AM
దేశవ్యాప్తంగా జూలై 9న చేపట్టిన సార్వత్రిక సమ్మెకు జిల్లాలో అన్ని శాఖల అధికారులు సహకరించాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కడారి రాములు, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎగమంటి ఎల్లా రెడ్డిలు కోరారు.
సిరిసిల్ల కలెక్టరేట్, జూన్ 27 (ఆంధ్రజ్యోతి) : దేశవ్యాప్తంగా జూలై 9న చేపట్టిన సార్వత్రిక సమ్మెకు జిల్లాలో అన్ని శాఖల అధికారులు సహకరించాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కడారి రాములు, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎగమంటి ఎల్లా రెడ్డిలు కోరారు. ఈ మేరకు కలెక్టరేట్‌లోని కలెక్టరేట్ ఏవో రాం రెడ్డితోపాటు జిల్లా వైధ్యాధికారి, జిల్లా పంచాయతీ అధికారి, జిల్లా పౌరసరఫరాల అధికారి, జిల్లా విద్యాశాఖ అధికారులను కార్మికసంఘాల నాయకులు శుక్రవారం కలిసి సార్వత్రిక సమ్మె నోటీసులను అందించి జూలై 9న ఉద్యోగులు, కార్మికులకు సెల వులను ప్రకటించాలని కోరారు. ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ దేశంలో ఉన్న 44 కార్మిక చట్టాలను కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నాలుగు కోడ్ చట్టాలుగా విభజించి కార్మికులను, ప్రజలను మోసం చేసేందుకు కుట్రలు పన్నుతోందన్నారు. ఇప్పటికే కార్మిక చట్టాలు, కార్మికులకు పూర్తి స్థాయిలో ఉపయోగంగా లేకుండా పోయాయన్నారు. ప్రస్తుతం కార్పొరేట్ శక్తులకు, ఎఫ్‌డీఐలకు అనుకూలంగా చట్టాలను మార్పు లు చేసి 8 గంటల పని విధానం, సమ్మెచేసే హక్కు, కనీస వేత నాల హక్కులాంటి వాటితో పాటు భవన నిర్మాణ రంగంలో లేబర్ కార్డు వ్యవస్థను ప్రైవేటుపరం చేసేందుకు కుట్ర చేస్తోందన్నారు. సహజ సంపదల దోపిడీ కార్పొరేట్ సంస్థలకు ఽధారాదత్తం చేసే విధానాలకు నిరసనగా జూలై 9న చేపట్టిన సార్వత్రిక సమ్మెలో ప్రతి ఉద్యోగి పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్య క్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు అజ్జవేణు, టీయూసీఐ నాయకులు జిందం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.