వెలిచాల పల్లె దవాఖానాకు ఎన్‌క్వాస్ అవార్డు
ABN , Publish Date - Jun 17 , 2025 | 11:52 PM
రామడుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని వెలిచాల పల్లె దవాఖానాకు ఎన్‌క్వాస్ కింద నాణ్యత సర్టిఫికెట్‌తోపాటు ఉత్తమ అవార్డు దక్కింది.
రామడుగు, జూన్ 17 (ఆంధ్రజ్యోతి): రామడుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని వెలిచాల పల్లె దవాఖానాకు ఎన్‌క్వాస్ కింద నాణ్యత సర్టిఫికెట్‌తోపాటు ఉత్తమ అవార్డు దక్కింది. నేషనల్ సిస్టమ్ రీసోర్స్ సెంటర్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఎన్‌క్వాస్ బృందం ప్రభుత్వ ఆసుపత్రుల తనిఖీ నిర్వహించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఐదు పల్లె దవాఖానాలకు ఎన్‌క్వాస్ నాణ్యత సర్టిఫికెట్‌తోపాటు ఉత్తమ అవార్డులు అందించారు. ఇందులో రామడుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని వెలిచాల పల్లె దవాఖానా 90.55 శాతం మార్కులతో అవార్డును దక్కించుకుందని రామడుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి రమేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సిబ్బందిని అభినందించారు.