మద్యం టెండర్లకు నోటిఫికేషన్ జారీ
ABN , Publish Date - Sep 27 , 2025 | 01:50 AM
జిల్లాలో గల రిటెయిల్ మద్యం షాపులకు వచ్చే రెండేళ్లకుగాను టెండర్లను ఆహ్వానిస్తూ ఎక్సైజ్ శాఖాధి కారులు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు.
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
జిల్లాలో గల రిటెయిల్ మద్యం షాపులకు వచ్చే రెండేళ్లకుగాను టెండర్లను ఆహ్వానిస్తూ ఎక్సైజ్ శాఖాధి కారులు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నెల 18వ తేదీ సాయంత్రం వరకు దరఖాస్తులను స్వీకరించ నున్నారు. గతంలో కంటే ఈసారి దరఖాస్తు ధరను 2 లక్షల నుంచి 3 లక్షల రూపాయలకు పెంచారు. ఆయా ప్రాంతాల జనాభా ఆధారంగా జిల్లాలో నాలుగు స్లాబు ల్లో షాపులు ఉన్నాయి. గ్రామాలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ ఉన్న దృష్ట్యా నాలుగు స్లాబులు వర్తించనున్నాయి. ఆ మేరకు మద్యం షాపులను దక్కిం చుకునే వాళ్లు లైసెన్స్ పీజు చెల్లించాల్సి ఉంటుంది. 5 వేల లోపు జనాభా గల షాపులకు ఏడాదికి 50 లక్షల రూపాయలు, 5001 నుంచి 50 వేల జనాభా ఉన్న ప్రాంతాల్లోని షాపులకు 55 లక్షలు, 50001 నుంచి లక్ష వరకు జనాభా ఉన్న ప్రాంతాల్లోని షాపులకు 60 లక్షలు, లక్ష నుంచి 5 లక్షల వరకు జనాభా ఉన్న ప్రాం తాల్లోని షాపులకు 65 లక్షలు, 500001 నుంచి 20 లక్షల వరకు జనాభా ఉన్న ప్రాంతాల్లోని షాపులకు 85 లక్షల రూపాయల ఫీజు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. మద్యం షాపులను దక్కించుకునే వాళ్లు మొదటి వాయిదా లైసెన్స్ ఫీజులో 6వ వంతు డబ్బు లను వచ్చే నెల 23వ తేదీ వరకు చెల్లించాలి. మద్యం షాపులను దక్కించుకునే నిర్వాహకులు డిసెంబర్ 1వ తేదీ నుంచి 2027 నవంబర్ 30వ తేదీ వరకు వాటిని నిర్వహించాల్సి ఉంటుంది. 2023లో నిర్వహించిన టెం డర్ల ద్వారా 77 షాపులకు 2022 దరఖాస్తులు రాగా, 40 కోట్ల 44 లక్షల రూపాయల ఆదాయం వచ్చింది.
ఫ జిల్లాలో 74 రిటెయిల్ మద్యం షాపులు..
జిల్లాలో 74 రిటెయిల్ మద్యం షాపులున్నాయి. ఈసారి మూడు షాపులు తగ్గాయి. గౌడ కులస్తులకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం మద్యం షాపులను కేటాయించాల్సి ఉంది. ఆ మేరకు గౌడ కులస్తులకు కేటాయించిన 13 షాపులు, ఎస్సీలకు 8 షాపులను, మొత్తం 21 షాపులను గురువారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష డ్రా ద్వారా ఎంపిక చేశారు. మిగతా 53 షాపులకు ఎవరైనా టెండర్లు వేసుకునే అవకాశం ఉంటుంది.
ఫ గౌడ కులస్తులకు కేటాయించిన 13 షాపుల్లో డ్రా ద్వారా ఎంపిక చేసిన షాపుల్లో పెద్దపల్లి పట్టణంలోని గెజిట్ నంబర్ 1 షాపు, గెజిట్ నంబర్ 5, సుల్తానాబాద్‌లోని గెజిట్ నంబర్ 22, కాల్వశ్రీరాం పూర్‌లోని గెజిట్ నంబర్ 27, గెజిట్ నంబర్ 28 షాపులు, కాల్వశ్రీరాంపూర్ మండలం పెగడపల్లిలోని గెజిట్ నంబర్ 35 షాపు, గోదావరిఖనిలోని గెజిట్ నంబర్ 43, గెజిట్ నంబర్ 45 షాపు, గెజిట్ నంబర్ 47 షాపు, పాలకుర్తి మండలం కన్నాల, జీడీనగర్‌లోని గెజిట్ నంబర్ 57 షాపు, మంథని మున్సిపాలిటీ పరిధి లోని గెజిట్ నంబర్ 65 షాపు, రామగిరి మండలం రత్నాపూర్, కల్వచర్లలో గల గెజిట్ నంబర్ 72 షాపు, ముత్తారం మండలంలోని ముత్తారంలో గెజిట్ నంబర్ 74 షాపులు ఉన్నాయి.
ఫ ఎస్సీలకు కేటాయించిన 8 షాపుల్లో పెద్దపల్లి పట్టణంలోని గెజిట్ నంబర్ 8 షాపు, ధర్మారంలోని గెజిట్ నంబర్ 15, ఎలిగేడు మండలం శివపెల్లి గెజిట్ 16, గోదావరిఖనిలోని గెజిట్ నంబర్ 38, గెజిట్ నంబర్ 39, గెజిట్ నంబర్ 42 షాపు, మంథని మున్సిపాలిటీ పరిధిలోని గెజిట్ నంబర్ 62, గెజిట్ నంబర్ 66 షాపులు ఉన్నాయి.
దరఖాస్తులను పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో గల ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యా లయం ఆవరణలో దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. మొదటి రోజు పెద్దపల్లిలో మద్యం షాపులకు 3 దరఖాస్తులు, సుల్తానాబాద్‌లో ఒకటి, మంథనిలో ఒకటి, రామగుండంలోని షాపులకు ఒక దరఖాస్తు వచ్చిందని ఎక్సైజ్ సూపరింటెండెంట్ మహిపాల్ రెడ్డి తెలిపారు.