రెండో రోజు నామినేషన్ల జోరు
ABN , Publish Date - Nov 29 , 2025 | 12:25 AM
గ్రామపంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం జోరుగా సాగుతోంది. సర్పంచ్, వార్డుసభ్యుల పదవుల కోసం అన్ని గ్రామాల్లో పోటాపోటీగా నామినేషన్లను దాఖలు చేస్తున్నారు. మొదటి విడతలో జిల్లాలోని కరీంనగర్ రూరల్, కొత్తపల్లి, చొప్పదండి, రామడుగు, గంగాధర మండలాల్లోని 92 సర్పంచ్, 866 వార్డుసభ్యుల పదవులకు ఎన్నికలు జరుగుతున్నాయి.
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
గ్రామపంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం జోరుగా సాగుతోంది. సర్పంచ్, వార్డుసభ్యుల పదవుల కోసం అన్ని గ్రామాల్లో పోటాపోటీగా నామినేషన్లను దాఖలు చేస్తున్నారు. మొదటి విడతలో జిల్లాలోని కరీంనగర్ రూరల్, కొత్తపల్లి, చొప్పదండి, రామడుగు, గంగాధర మండలాల్లోని 92 సర్పంచ్, 866 వార్డుసభ్యుల పదవులకు ఎన్నికలు జరుగుతున్నాయి. గురువారం నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కాగా తొలిరోజు సర్పంచ్ పదవులకు 92, వార్డు సభ్యుల పదవులకు 86 నామినేషన్లు దాఖలయ్యాయి. రెండోరోజు శుక్రవారం సర్పంచ్ పదవులకు 197 మంది నామినేషన్లను దాఖలుచేశారు. 543 మంది వార్డు సభ్యులకు నామినేషన్లను సమర్పించారు.
- శుక్రవారం చొప్పదండి మండలంలోని 16 గ్రామాల్లో సర్పంచ్ స్థానాలకు 33 నామినేషన్లు, 154 వార్డులకు 69 నామినేషన్లు దాఖలయ్యాయి.
- గంగాధర మండలంలోని 33 గ్రామాల్లో 71 మంది సర్పంచ్ పదవులకు, 296 వార్డులకు 214 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు.
- రామడుగు మండలంలోని 23 గ్రామాల్లో సర్పంచు పదవులకు 47, 222 వార్డు సభ్యుల పదవులకు 130 నామినేషన్లు దాఖలయ్యాయి.
- కొత్తపల్లి మండలంలోని ఆరు గ్రామాల సర్పంచు స్థానాలకు 21, 62 వార్డు సభ్యుల పదవులకు 67 నామినేషన్లు, కరీంనగర్ రూరల్ మండలంలోని 14 గ్రామాల సర్పంచు పదవులకు 25, 132 వార్డు సభ్యుల స్థానాలకు 63 మంది నామినేషన్లు వేశారు.
రెండురోజుల్లో ఐదు మండలాల్లోని 92 సర్పంచు స్థానాలకు 286 నామినేషన్లు వచ్చాయి. 866 వార్డులకు 629 నామినేషన్లు సమర్పించారు. శనివారంతో నామినేషన్ల గడువు ముగియనున్నది. దీంతో చివరిరోజు నామినేషన్ల అత్యధికంగా వేసే అవకాశాలుంటాయని భావిస్తున్నారు.