బియ్యానికే పరిమితమైన కొత్త రేషన్‌కార్డులు
ABN , Publish Date - Nov 03 , 2025 | 01:01 AM
రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా జారీ చేస్తున్న రేషన్ కార్డుల వినియోగ దారులకు ఇతర పథకాలు వర్తించపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఆ కార్డులపై కేవలం రేషన్ బియ్యం మినహా మరే ఇతర పథకాలు అందడం లేదు.
- వర్తించని సంక్షేమ పథకాలు
- కొత్త దరఖాస్తులకు ఆన్‌లైన్‌లో నోఆప్షన్
- పథకాలు వర్తింపజేయాలంటున్న లబ్ధిదారులు
(ఆంద్రజ్యోతి, పెద్దపల్లి)
రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా జారీ చేస్తున్న రేషన్ కార్డుల వినియోగ దారులకు ఇతర పథకాలు వర్తించపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఆ కార్డులపై కేవలం రేషన్ బియ్యం మినహా మరే ఇతర పథకాలు అందడం లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేస్తామని ప్రకటించింది. ఆ మేరకు మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య సౌకర్యం, రెండు లక్షల వరకు రైతులకు రుణమాఫీ, రైతు భరోసా పథకం కింద ఎకరానికి 6 వేల రూపా యల చొప్పున పెట్టుబడి సాయాన్ని, కూలీలకు ఆర్థిక సహాయం అంది స్తున్నది. అలాగే గృహలక్ష్మి పథకం ద్వారా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 500 రూపాయలకే సబ్సిడీ గ్యాస్, ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ఇళ్ల మంజూరు, కొత్త రేషన్ కార్డులను అందజేస్తున్నది. గత ప్రభుత్వ హయాంలో రేషన్ కార్డుల కోసం అనేక మంది దరఖాస్తు చేసుకున్నప్పటికీ కార్డులు మంజూరు చేయలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఏడాది నుంచి అర్హులైన వారికి రేషన్ కార్డులను అందజే స్తున్నది. వాటిపై ఆగస్టు నుంచి ఉచితంగా సన్న రేషన్ బియ్యం సరఫరా చేస్తున్నది. అయితే ఈ కార్డులు పొందిన వారికి గృహలక్ష్మి ద్వారా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, వంట గ్యాస్ సబ్సిడీ పథకాలు వర్తింప జేయడం లేదు. ప్రభుత్వం రేషన్ కార్డులు ఇచ్చినప్పటికీ, ఆయా పథకాలు వర్తింప జేయకపోవడంతో నిరాశ, నిస్పృహలకు గురవుతున్నారు. ఆయా పథకాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఆయా కార్యాలయాలకు వెళు తున్నప్పటికీ ప్రజాపాలన సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునేం దుకు ప్రభుత్వం ఆప్షన్ ఇవ్వడం లేదని వాపోతున్నారు.
ఫ కొనసాగుతున్న కార్డుల జారీ ప్రక్రియ
జిల్లాలో 413 రేషన్ షాపులు ఉండగా, వీటి పరిఽధిలో 2,35,721 రేషన్ కార్డులున్నాయి. 7,29,534 మంది ఆ కార్డుల ద్వారా రేషన్ బియ్యం పొందు తున్నారు. జిల్లా వ్యాప్తంగా 14 వేలకు పైగా కొత్త కార్డులను జారీ చేశారు. రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరం కొనసాగిస్తామని ప్రభుత్వం ప్రక టించింది. మీసేవా కేంద్రాల ద్వారా కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి, వారి ఆర్థిక స్థితిగతులపై రెవెన్యూ సిబ్బంది క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి అర్హులను గుర్తించి కార్డులు జారీ చేస్తున్నారు. ఆహార భద్రత కార్డు పొందిన వెంటనే కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరి పేరిట 6 కిలోల చొప్పున ఉచిత బియ్యం అందిస్తున్నారు.
ఫ ప్రజాపాలనలో కార్డులు లేక అందని పథకాలు..
ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2023 డిసెంబరు 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు గ్రామాల్లో గ్రామసభలు, పట్టణాల్లో వార్డు సభలను నిర్వహించి ఆరు గ్యారంటీ పథకాల్లో భాగంగా 5 పథకాల కోసం ఒకే నమూనా దరఖాస్తులను స్వీకరించింది. రేషన్ కార్డులు లేని వారి నుంచి కూడా దరఖాస్తులను తీసుకున్నారు. ఈ దరఖాస్తులను అన్నింటినీ ప్రజాపాలన వెబ్‌సైట్‌లో నమోదు చేశారు. అప్పటికీ రేషన్ కార్డులు కలిగి ఉన్న వారికే ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తించాయి. ప్రజాపాలన దరఖాస్తులు నిరంతర ప్రక్రియ అని అధికారులు చెప్పినప్పటికీ, పాత దరఖాస్తుల్లో తప్పుల సవరణకు మాత్రమే అవకాశం కల్పించారు. కొత్తగా అర్జీలు స్వీకరించడం లేదు. మీసేవాలో దరఖాస్తు చేసుకోవాలనుకున్నా కొత్త వారి కోసం ఆన్‌లైన్‌లో నమోదుకు వెబ్‌ఆప్షన్ కూడా అందుబాటులో లేదు. దీంతో కొత్త కార్డుదారులందరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందలేకపోతున్నారు. తమకు ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు జారీ చేసి నప్పటికీ ఇతర పథకాలు వర్తించడం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు. ఎంపీడీవో, మున్సిపల్ కార్యాలయాలకు వెళితే ఆప్షన్ రాలేదని అంటు న్నారని తెలిపారు. సంక్షేమ పథకాలకు అర్హులైనప్పటికీ గృహలక్ష్మి, రూ.500కే సబ్సిడీ గ్యాస్ పొందలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆయా సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందేందుకు అవకాశం కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.