Share News

లింగన్నపేట హైలెవల్‌ బ్రిడ్జి నిర్మాణంలో నిర్లక్ష్యం

ABN , Publish Date - Sep 25 , 2025 | 12:06 AM

గంభీరావుపేట-లిం గన్నపేట గ్రామాల మధ్య నిర్మించతలపెట్టిన హైలెవల్‌ బ్రిడ్జి పనుల్లో మూడేళ్లుగా నిర్లక్ష్యం కొనసాగుతోందని, అందుకు సదరు కాంట్రాక్టర్‌ కు అధికారులు వత్తాసు పలుకుతున్నారని టీపీసీసీ సీనియర్‌ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం ఆరోపించారు.

లింగన్నపేట హైలెవల్‌ బ్రిడ్జి నిర్మాణంలో నిర్లక్ష్యం

గంభీరావుపేట, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి) : గంభీరావుపేట-లిం గన్నపేట గ్రామాల మధ్య నిర్మించతలపెట్టిన హైలెవల్‌ బ్రిడ్జి పనుల్లో మూడేళ్లుగా నిర్లక్ష్యం కొనసాగుతోందని, అందుకు సదరు కాంట్రాక్టర్‌ కు అధికారులు వత్తాసు పలుకుతున్నారని టీపీసీసీ సీనియర్‌ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం ఆరోపించారు. హై లెవల్‌ బ్రిడ్జి నిర్మాణ పనుల్లో నిర్లక్షానికి కారణమైన కాంట్రాక్టర్‌, అధికా రులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ఊపేక్షించే ప్రసక్తి లేదని కటకం పేర్కొన్నారు. గంభీరావుపేట-లింగన్నపేట మధ్య మానేరువా గు వద్ద బుధవారం మృత్యుంజయం విలేకరుల సమావేశాన్ని ఏర్పా టుచేశారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పెద్దమ్మ నుంచి లింగన్నపేట వరకు 11 కిలోమీటర్ల రోడ్డును జిల్లా పరిషత్‌ నుంచి ఆర్‌అండ్‌బీగా మార్చింది తానేనన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలోనే ఈ లోలెవల్‌ బ్రిడ్జి నిర్మించిన విష యాన్ని గుర్తుచేశారు. కొత్త హైలెవల్‌ బ్రిడ్జి కోసం ఉన్న లోలెవల్‌ బ్రిడ్జి ని కూల్చేసిన సదరు కాంట్రాక్టర్‌పై, కూల్చేయించిన అధికారులపై చర్య లు తీసుకోవాలన్నారు. పాత బ్రిడ్జి సలాకను వాహనాల్లో తరలించి లక్ష ల రూపాయలను సొమ్ము చేసుకున్నారని ఆరోపించారు. అమ్మేసిన సలాకను రికవరీ చేయాలన్నారు. కాంట్రాక్టర్‌ టెండర్‌ను రద్దు చేసి, బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టాలన్నారు. అదే విధంగా తిరిగి తొందరగా టెండర్‌ పక్రియను పూర్తి చేయాలన్నారు. కాంట్రాక్టర్‌, అధికారులు కమ్మక్కై ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని నిర్లక్షం చేస్తున్నారని, మూడేళ్ల వ్యవధిలో 10 శాతం పనులు కూడా జరగలేదని ఇలాంటి వారిపై ప్రభుత్వం చర్యలు తీసు కోవడం ఖాయమన్నారు. ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రిని ఈ బ్రిడ్జి కోసం ఇటీవల కలిసి పరిస్థితిని వివరించామన్నారు. అప్పటికప్పుడే అధికారు లతో మంత్రి మాట్లాడారని తెలిపారు. అయినా జిల్లా స్థాయి అధికా రులు స్పందించకపోవడంతో ఈఎన్‌సీతో మృత్యుంజయం ఫోన్‌లో మా ట్లాడారు. ఈ సమావేశంలో కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు హమీద్‌, నాయకులు వెంకటి, మల్యాల రాజవీర్‌, బాలయ్య, ఎర్ర నర్సయ్య, యెల్ల బాలకృష్ణ, లక్ష్మీనారాయణ, కిషన్‌గౌడ్‌, భాస్కర్‌, మోహన్‌, రాజు, లింగం, శంకర్‌, మల్లయ్య తదితరులు ఉన్నారు.

Updated Date - Sep 25 , 2025 | 12:06 AM