నీట్‌ను పకడ్బందీగా నిర్వహించాలి
ABN , Publish Date - Apr 30 , 2025 | 12:20 AM
వైద్య కళాశాలల్లో ప్రవేశాల నిమిత్తం మే 4న జరిగే నీట్‌ను జిల్లాలో పకడ్బందీగా నిర్వహించాలని డీఆర్వో వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌హాల్‌లో నీట్ నిర్వహణపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
- డీఆర్వో వెంకటేశ్వర్లు
కరీంనగర్ టౌన్, ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి): వైద్య కళాశాలల్లో ప్రవేశాల నిమిత్తం మే 4న జరిగే నీట్‌ను జిల్లాలో పకడ్బందీగా నిర్వహించాలని డీఆర్వో వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌హాల్‌లో నీట్ నిర్వహణపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ జిల్లా పరిధిలో మే 4న జరిగే నీట్ యూజీ పరీక్ష రాసే 2,975 మంది విద్యార్థుల కోసం ఏడు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు అవసరమైన అన్ని వసతులు కల్పించామని తెలిపారు. ఎక్కడా మాల్ ప్రాక్టీస్ కాకుండా జాగ్రత్తలు వహించాలని, సీసీటీవీ మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేసి పరీక్షను పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. మే 4న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లో అనుమతిస్తామని తెలిపారు. మధ్యాహ్నం 1:30కు గేట్ మూసి వేస్తారని, 1:40 గంటలలోపు విద్యార్థులు డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకుని పరీక్ష హాల్‌కు చేరుకోవాలని సూచించారు. పరీక్ష మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జరుగుతుందని తెలిపారు. సమావేశంలో నీట్ జిల్లా కో-ఆర్డినేటర్ పంకజ్‌కుమార్, జిల్లా మైనార్టీ అభివృద్ధి అధికారి పవన్ కుమార్, డీఎంహెచ్‌వో వెంకటరమణ, ఎన్‌పీడీసీఎల్ ఏడీఈ లావణ్య, జిల్లా సంక్షేమ అధికారి సర్వసతి, ఏసీపీ మాధవి, డీఎఫ్‌వో శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.