Share News

దేశ సేవకు పునరంకితం కావాలి

ABN , Publish Date - Aug 16 , 2025 | 12:38 AM

ప్రతి ఒక్కరు దేశసేవకు పునరంకితం కావాలని ఎస్పీ మహేశ్‌ బి. గీతే అన్నారు.

దేశ సేవకు పునరంకితం కావాలి

సిరిసిల్ల క్రైం, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి): ప్రతి ఒక్కరు దేశసేవకు పునరంకితం కావాలని ఎస్పీ మహేశ్‌ బి. గీతే అన్నారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాల యం ఆవరణలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ జెండాను ఎస్పీ ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్ర పోరాటా న్ని గుర్తుచేసుకోవడం, దేశానికి స్వేచ్చ కల్పించిన త్యాగధనులను స్మరించుకోవ డం మనందరి బాధ్యత అన్నారు. పోలీసు అధికారులు జాతీ సమగ్రత, సమా జంలో శాంతి స్థాపనకు కృషిచేయాలన్నారు. ఎందరో మహానుభావుల త్యాగఫల మే మనమంతా స్వేచ్ఛగా జీవిస్తున్నామన్నారు. మహానుభావుల త్యాగాలను నిరంతరం స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, సిఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

బెటాలియన్‌లో..

సిరిసిల్ల పట్టణ పరిధిలోని సర్ధాపూర్‌ 17వ బెటాలియన్‌ లో 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా శుక్రవారం జాతీయ జెండాను కమాండెంట్‌ ఎం.ఐ. సురేశ్‌ ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్‌ కమాండెంట్‌ రాందాస్‌, ఏఓ ప్రమీల, తదితరులు పాల్గొన్నారు.

జిల్లా కోర్టులో..

రాజన్న సిరిసిల్ల జిల్లా కోర్టు ఆవరణలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరిం చుకొని శుక్రవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి. నీరజ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ముందుగా పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా 1వ సెషన్స్‌ జడ్జి పుష్పలత, సీనియర్‌ సివిల్‌ జడ్జి లక్ష్మణాచారి, ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి ప్రవీణ్‌, జూనియర్‌ సివిల్‌ జడ్జి మేఘన, జూనియర్‌ సివిల్‌ జడ్జి మేఘన, సిరిసిల్ల బార్‌ అసోసియేషన్‌ అధ్య క్షులు జూపల్లి శ్రీనివాసరావు, కార్యదర్శి వెంకటి, సీనియర్‌, జూనియర్‌ న్యాయవా దులు పాల్గొన్నారు.

Updated Date - Aug 16 , 2025 | 12:38 AM