అసంపూర్తిగా డైనింగ్ హాల్
ABN , Publish Date - Nov 06 , 2025 | 12:03 AM
అధికారుల నిర్లక్ష్యంతో అభివృద్ది పనులు అసంపూర్తిగా నిలిచిపోతున్నాయి. గంగాధర మండలం కురిక్యాల పాఠశాలలో గత ప్రభుత్వం మన ఊరు, మన బడి పథకంలో అభివృద్ది పనులకు నిధులు మంజూరు చేసింది.
గంగాధర, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): అధికారుల నిర్లక్ష్యంతో అభివృద్ది పనులు అసంపూర్తిగా నిలిచిపోతున్నాయి. గంగాధర మండలం కురిక్యాల పాఠశాలలో గత ప్రభుత్వం మన ఊరు, మన బడి పథకంలో అభివృద్ది పనులకు నిధులు మంజూరు చేసింది. ఇందులో భాగంగా విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేసేందుకు 12 లక్షల రూపాయలతో డైనింగ్ హాల్ నిర్మించాలని నిర్ణయించి పనులు ప్రారంభించారు. డైనింగ్ హాల్‌ను గోడల వరకు నిర్మించిన కాంట్రాక్టర్ మధ్యలోనే వదిలేశాడు. మూడేళ్లుగా డైనింగ్‌హాల్ పనులు అసంపూర్తిగా మిగిలిపోయింది. ఈ పాఠశాలలో విద్యార్థులు స్టడి హవర్ కోసం గతంలో చెట్లు నాటగా అవి వృక్షాలుగా పెరిగాయి. ఈ చెట్లపై వందల సంఖ్యలో కోతులు చేరి విద్యార్థుల చదువుకు ఆటంకం కలిగిస్తున్నాయి. మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థులపైకి ఎగబడి దాడులు చేస్తున్నాయి. డైౖనింగ్ హాల్ పూర్తి చేస్తే కోతుల బెడద తప్పుతుందని విద్యార్థులు అంటున్నారు. అధికారులు స్పందించి అసంపూర్తిగా ఉన్న డైనింగ్ హాల్‌ను పూర్తి చేయాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.