Share News

ఘనంగా జాతీయ చేనేత దినోత్సవం

ABN , Publish Date - Aug 08 , 2025 | 12:41 AM

రాజన్న సిరిసిల జిల్లా కేంద్రం లో గురువారం జాతీయ చేనేత దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వ హించారు.

ఘనంగా జాతీయ చేనేత దినోత్సవం

సిరిసిల్ల టౌన్‌, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి) : రాజన్న సిరిసిల జిల్లా కేంద్రం లో గురువారం జాతీయ చేనేత దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వ హించారు. స్థానిక పాతబస్టాండ్‌ సమీపం చేనేత చౌక్‌లోని నేతన్న విగ్ర హానికి కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా, కాంగ్రెస్‌ పార్టీ సిరిసిల్ల నియోజవక వర్గం ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి పూల మాలలు వేశారు. జై నేతన్న... జైజై నేతన్న నినాదాలు చేశారు. అనంతరం సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు ప్రజా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాల్లో వర్కు ఆర్డర్లు, యారన్‌ బ్యాంక్‌ ఏర్పాటు, పాఠశాల విద్యార్థుల యూనిఫాం ఆర్డర్లు, విద్యుత్‌ సబ్సి డీలను గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటుకు వస్త్ర పరిశ్రమ యజమానులు, ఆసాములు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చేనేత జౌళిశాఖ ఏడీ రాఘవరావు, వస్త్ర పరిశ్రమ సంఘా లు, అనుబంధ సంఘాల నాయకులు, వస్త్ర పరిశ్రమ యజమానులు, ఆసా ములు, పద్మశాలి సంఘం నాయకులు, నేత కార్మికులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో..

బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో గురువారం సిరిసిల్లలో జాతీయ చేనేత దినోత్సవం ఘనంగా జరగింది. బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి నాయకులు నేతన్న విగ్రహా నికి పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీన్‌, పట్టణ కార్యదర్శి మ్యాన రవి, మహిళ పట్టణ అధ్యక్షు రాలు బత్తుల వనిజ, కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు వెంగళ శ్రీనివాస్‌, బీఆర్‌ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బని హరీష్‌, సెస్‌ డైరెక్టర్‌ దార్నం లక్ష్మినారాయణ, సిరిసిల్ల అర్బన్‌ బ్యాంక్‌ వైస్‌చైర్మన్‌ ఆడగట్ల మురళి, గ్రంథాలయం సంస్థ మాజీ చైర్మన్‌ ఆకునూరి శంకరయ్య, మున్సిపల్‌ మాజీ వైస్‌చైర్మన్‌ మంచె శ్రీనివాస్‌, మాజీ కౌన్సిలర్లు కల్లూరి రాజు, గెంట్యాల శ్రీనివాస్‌, దార్ల సందీప్‌ అన్నారపు శ్రీనివాస్‌, దార్నం అరుణలక్ష్మీ నారాయణ, రిక్కుమల్ల సంపత్‌కు మార్‌ నాయకులు పాల్గొన్నారు.

సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో..

జిల్లాకేంద్రంలో సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో జా తీయ చేనేత దినోత్సవం ఘనంగా నిర్వహించారు. స్థానిక నేత న్న విగ్రహానికి నాయకులు పూలమాలలు వేశారు. అనంతరం ఖాదీభవన్‌లో చేనేత కళాకారులు ఆడెపు పోషవ్వ, తేల్ల కనకవ్వ, వెంగల రవీందర్‌, గుంటుక మధుసూదన్‌, రిక్కుమల్ల కొమ రయ్య, మంగళారపు రాజేశం, కళ్యాడపు దేవదాస్‌, ఖాదీ నిర్వా హకుడు ఆడెపు రమేష్‌లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో సామాజిక సమరసత వేదిక జిల్లా నాయకులు మోర శ్రీనివాస్‌, కోడం రవి, గూడూరి భాస్కర్‌, వివిధ పార్టీల నాయకులు నాగుల శ్రీనివాస్‌, దూడం శ్రీనివాస్‌, చిమ్మని ప్రకాష్‌, మాదాసు శ్రీనివాస్‌, గుడ్ల విష్ణు, గుజ్జె శివరాం, గాజుల వేణు, దాసరి శ్రీనివాస్‌, నవీన్‌యాదవ్‌ తది తరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 08 , 2025 | 12:41 AM