పల్లెల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యం
ABN , Publish Date - Sep 13 , 2025 | 12:43 AM
పల్లెల అభివృద్ధితోనే దేశం అభివృద్ధి చెందుతుందని చొప్పదండి ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యం అన్నారు.
చొప్పదండి ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యం
కొడిమ్యాల, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యో తి): పల్లెల అభివృద్ధితోనే దేశం అభివృద్ధి చెందుతుందని చొప్పదండి ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యం అన్నారు. శుక్ర వారం మండల పరిషత్ కార్యాలయంలో ఎమ్మెల్యే మండలంలోని వివిధ గ్రామాల కు చెందిన 46 మంది లబ్దిదారులకు 12, 16,500 రూపాయల విలువైన సీఎంఆర్ ఎఫ్ చెక్కులను అందించారు. అనంతరం మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న ఎస్‌జీఎఫ్ అండర్ 14-17 క్రీడలను ప్రా రంభించారు. అనంతరం మండలంలోని దమ్మయ్య పేట గ్రామ శివారులోని వరదరాయ చెరువును పరి శీలించి చెరువు అభివృద్ధి పనులను త్వరగా చేపడతామని హామీ ఇచ్చారు. అనంతరం అంగన్‌వాడీ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఒడ్డెర కుల సంఘ భవనాన్ని ప్రారంభిచారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ బతుకమ్మ తెప్పె నిర్మాణం చేపట్టుతామన్నారు. గ్రామంలో పండగ లోపు హైమాస్ట్ లైట్లను ఏర్పాటు చేస్తామన్నారు. అంతక ముందు మండల కేంద్రంలోని పాఠశాలలో క్రీడాకారులు నిర్వహించిన మార్చ్ పోస్టులో గౌరవ వందనాన్ని ఎమ్మెల్యే స్వీకరించారు. క్రీడారంగం అభివృద్దికి తమ వంతు కృషి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కార్యక్రమాల్లో తహసీల్దార్ కిరణ్‌కు మార్, ఎంపీడీవో స్వరూప, చొప్పదండి మార్కెట్ కమి టీ చైర్మన్ మహేష్, మల్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ జీవన్‌రెడ్డ్డి, సింగిల్ విండో చైర్మన్లు రాజనర్సింగరావు, రవీందర్‌రెడ్డ్డి, కాంగ్రెస్ పార్టీ మండ ల అధ్యక్షుడు నారాయణగౌడ్, కేంద్ర సహకార బ్యాంక్ మాజీ డైరెక్టర్ మల్లికార్జున్‌రెడ్డ్డి, కాంగ్రెస్ పార్టీ సీని యర్ నాయకులు మహిపాల్‌రెడ్డ్డి, ప్రభాకర్‌రెడ్డి, ము త్యం శంకర్‌గౌడ్, మల్లేశంయాదవ్, స్వామి, మ్యాకల మల్లేశం, చంద్రమోహన్‌రెడ్డ్డి, స్వామి, రవి, గంగన్న, ఎంఈవో శ్రీనివాస్, పీడీ రాజమల్లయ్య, ప్రధానోపాధ్యాయురాలు విజయేంద్ర, సీఐ నీలం రవి పాల్గొన్నారు.
ఉత్తమమైన సేవలతోనే గుర్తింపు
జగిత్యాల (ఆంధ్రజ్యోతి): ఉత్తమమైన సేవలతోనే ప్రజల్లో గుర్తింపు లభిస్తుందని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. ఈనెల 13వ తేదీన మల్యాల ఎక్స్ రోడ్డులో గల బంకెట్ హాల్‌లో వాసవి ట్రస్ట్ ఆద్వర్యంలో నిర్వహిం చనున్న జగిత్యాల జిల్లా ఆర్యవైశ్య ఉపాధ్యాయ ఉత్స వ్ - 2025లో భాగంగా సుమారు 200 మంది ఉపా ధ్యాయులు, అధ్యాపకులకు సన్మాన మహోత్సవ ఆహ్వా న పత్రాన్ని శుక్రవారం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు నిర్వాహకులు అందించారు. సేవాభావంతో వాసవి ట్రస్ట్ పలు కార్యక్రమాలు నిర్వహిస్తుండడం సంతోషక రమన్నారు. కార్యక్రమంలో వాసవి ట్రస్ట్ వ్యవస్థాప కుడు పబ్బ శ్రీనివాస్, జిల్లా ఆర్యవైశ్య సంఘం నా యకులు నూనె శ్రీనివాస్, దువ్వ రాజు, గుండ శ్రీకాం త్, కాసం రాజశేఖర్, నాయకులు పాల్గొన్నారు.