ప్రభుత్వ విధి విధానా ప్రకారం పని చేయాలి
ABN , Publish Date - Oct 04 , 2025 | 11:37 PM
: రాష్ట్ర ప్రభుత్వం ప్రకారం పని చేయాలని టీజీఎండీసీ ఎండీ, వీసీ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు.
తిమ్మాపూర్, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రకారం పని చేయాలని టీజీఎండీసీ ఎండీ, వీసీ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. శనివారం మండలంలోని కొత్తపల్లి సమీపంలోని ఎల్‌ఎండీ ప్రాజెక్టులో ఇసుక రీచ్‌ను, ఎల్‌ఎండీ ప్రాజెక్టు పూడికతీత పనులను ఆయన పరిశీలించారు. ప్రభుత్వ పరంగా తీసుకున్న అనమతుల ప్రకారమే పని చేయాలని పూడికతీస్తున్న ఎమోట్ డ్రెడ్జింగ్ ప్రయివేటు లిమిటెడ్ యాజమాన్యాన్ని ఆదేశించారు. పనులు వేగంగా కొనసాగించాలని, రిజర్వాయర్ సామర్థ్యాన్ని పెంచుకోవడంతోపాటు ప్రభుత్వానికి ఆదాయం సమకురుతుందని తెలిపారు. ఎల్‌ఎండీ తరహాలోనే మిడ్ మానేరు, కడెం ప్రాజెక్టుల్లో పూడికతీత పనులకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ ఎస్‌ఈ పెద్ది రమేష్, కరీంనగర్ మైనింగ్ ఏజీ వెంకటేశ్వర్లు, ఇరిగేషన్ ఈఈ సదయ్య, టీజీఎండీసీ ప్రాజెక్టు ఆఫీసర్లు వినయ్‌కుమార్, రాజు, తహసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.