Share News

నిబంధనలకు అనుగుణంగా ముందుకెళ్లాలి

ABN , Publish Date - Oct 07 , 2025 | 12:33 AM

ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా రైస్‌ మిల్లర్లు ముందుకు వెళ్లాలని జిల్లా కలెక్టర్‌ ఎం హరిత ఆదేశించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం ఖరీఫ్‌ సీజన్‌ వరి ధాన్యం సేకరణ, బ్యాంక్‌ గ్యారంటీ, సీఎంఆర్‌

నిబంధనలకు అనుగుణంగా ముందుకెళ్లాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ హరిత

సిరిసిల్ల, ఆక్టోబరు 6 (ఆంరఽధజ్యోతి): ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా రైస్‌ మిల్లర్లు ముందుకు వెళ్లాలని జిల్లా కలెక్టర్‌ ఎం హరిత ఆదేశించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం ఖరీఫ్‌ సీజన్‌ వరి ధాన్యం సేకరణ, బ్యాంక్‌ గ్యారంటీ, సీఎంఆర్‌ సరఫరా తదితర అంశాలపై రా, బాయిల్డ్‌ రైస్‌ మిల్లర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని రైస్‌ మిల్లర్లు సీఎంఆర్‌ సరఫరా చేయాలని ఆదేశించారు. గత ఖరీఫ్‌ సీజన్లో జిల్లాలో 2.15 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని వెల్లడిం చారు. ఈ నెల మూడో వారంలో జిల్లాలో వరి కోతలు మొదలు కానున్నాయని తెలిపారు. ఈ సీజన్లో జిల్లాలో దాదాపు 2.17 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి రానున్నదని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారని తెలిపారు.ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్ని రైస్‌ మిల్లర్లు బ్యాంక్‌ గ్యారెంటీ ఇవ్వాలని ఆదేశించారు. నిబంధనల ప్రకారం మిల్లులకు ధాన్యం కేటాయిస్తామని స్పష్టం చేశారు. పలువురు రైస్‌ మిల్లర్ల అసోసియేషన్‌ నుంచి సమస్యలు కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఎఫ్‌సిఐకి బియ్యం ఇచ్చేందుకు బెడ్స్‌ ఇప్పించాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్‌ కు విన్నవించగా, ప్రభుత్వ నిబంధవల ప్రకారం మిల్లర్లకు సహకరిస్తామని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ గడ్డం నగేష్‌, జిల్లా పౌర సరఫరాల అధికారి చంద్రప్రకాష్‌, డీఎం రజిత తదితరులు పాల్గొన్నారు.

గ్రీన్‌ ఫీల్డ్‌ రహదారి డీపీఆర్‌పై సమీక్ష

సిరిసిల్ల టౌన్‌ : గ్రీన్‌ ఫీల్డ్‌ నాగపూర్‌ - హైదరాబాద్‌ హైస్పీడ్‌ కారిడార్‌ అభివృద్ధికి డీపీఆర్‌ నమూనాపై సోమవారం జిల్లా సమీకృత కార్యాలయంలో కలెక్టర్‌ ఎం హరితతో రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ వికాస్‌రాజ్‌ వీడియో కాన్పరెన్స్‌ ద్వారా సమీక్షించారు. మహారాష్ట్ర - తెలంగాణ రాష్ట్రంలో విజన్‌ - 2047లో భాగంగా జాతీయ రహదారుల మాస్టర్‌ ప్లాన్‌ కింద నాగపూర్‌ నుంచి హైదరాబాద్‌ వరకు హై స్పీడ్‌ కారిడార్‌ అభివృద్ధికి డీపీఆర్‌ ఏ విధంగా ఉండాలనే దానిపై అధికారులతో చర్చించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌తో పాటు ఆసిఫాబాద్‌, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్‌, సిద్దిపేట జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్సరెన్స్‌ ద్వారా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల కలెక్టరేట్‌ పర్యవేక్షకులు శ్రీకాంత్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Oct 07 , 2025 | 12:33 AM