నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వర్తించాలి
ABN , Publish Date - Dec 11 , 2025 | 12:34 AM
రాష్ట్ర ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వర్తించాలని జిల్లా ఎన్నికల అధికారి, ఇన్‌చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ అన్నారు.
వేములవాడ రూరల్, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వర్తించాలని జిల్లా ఎన్నికల అధికారి, ఇన్‌చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ అన్నారు. గ్రామ పంచాయతీ మొదటి ఫేజ్ ఎన్నికల్లో బాగంగా మండల ఎన్నికల సామగ్రి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని బుధవారం ఆమె పరిశీలించారు. ఎన్నికల విధులు నిర్వర్తించే ఉద్యోగులు బ్యాలెట్ పేపర్లు, ఇతర సామగ్రి సరిచూసుకోవాలన్నారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుంచి పోలింగ్ కేంద్రాలకు కేటాయించిన వాహనా ల్లోనే సామగ్రిని తరలించాలన్నారు. అనంతరం ఎన్నికల సామగ్రితో పోలింగ్ కేంద్రాలకు వెళ్లే వాహనాలను కలెక్టర్ గరిమ అగ్రవాల్ జెండా ఊపి ప్రారం భించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ చంద్రయ్య, ఎంపీడీవో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.