Share News

నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వర్తించాలి

ABN , Publish Date - Dec 06 , 2025 | 12:48 AM

రాష్ట్ర ఎన్నికల కమి షన్‌ నిబంధనలకు అనుగుణంగా విధులను నిర్వర్తించాలని రాజన్న సిరిసిల్లా జిల్లా ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్‌ పేర్కొన్నారు.

నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వర్తించాలి

ముస్తాబాద్‌, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ఎన్నికల కమి షన్‌ నిబంధనలకు అనుగుణంగా విధులను నిర్వర్తించాలని రాజన్న సిరిసిల్లా జిల్లా ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్‌ పేర్కొన్నారు. ముస్తాబాద్‌ మండల కేంద్రంలోని రైతు వేదికలో శుక్రవారం ప్రిసిడింగ్‌ అధికారులకు శిక్షణ, ఎన్నికల నిర్వ హణపై అవగాహన కల్పించారు. పీపీటీ ప్రదర్శన ఇచ్చి ప్రతి అంశంపై వివరించారు. ఎస్‌ఈసీ ఆదేశాల ప్రకారం విధులు నిర్వ ర్తించాలని పోలింగ్‌ కేంద్రాలలో విద్యుత్‌ సరాఫరా, నీటివసతి వంటి మౌలిక వసతులు కల్పించాలని కోరారు. బ్యాలెట్‌ బాక్సులు, బ్యాలెట్‌ పేపర్లు, ఇంక ఇతర సామగ్రి సరిచేసుకోవాలని సూచించారు. డిస్ట్రి బ్యూషన్‌ కేంద్రాల నుంచి పోలింగ్‌ కేంద్రాలకు కేటయించిన వాహ నాల్లోనే ఎన్నికల సామగ్రిని తరలించాలని స్పష్టం చేశారు. పలువు రు సందేహాలను నివృత్తి చేశారు. ముస్తాబాద్‌లోని నామినేషన్‌ కేంద్రాన్ని పరిశీలించారు. కలెక్టర్‌ వెంట ప్రత్యేకాధికారులు అఫ్జల్‌ బేగం, రాఘవేందర్‌, ఎంఆర్‌వో రాంచందర్‌, ఎంపీడీవో లచ్చాలు, ట్రైనీలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 06 , 2025 | 12:48 AM